Balakrishna: దర్శకుడు ప్రశాంత్ వర్మ తేజ సజ్జా ను హీరోగా పెట్టి చేసిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అయింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తుంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా ఇంత పెద్ద భారీ విజయాన్ని సాధించడంతో ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా సూపర్ గా ఉంది అంటూ వాళ్ళ అభిమానాన్ని తెలియచేస్తున్నారు.
ఇక దాంతో ఈ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ వర్మ దీనికి సిక్వల్ కోసం ఇప్పటికే విపరీతమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మళ్ళీ సంక్రాంతికి జై హనుమన్ సినిమాను తీసుకొస్తానని సినిమా ఎండింగ్ లో వేయడంతో ఇప్పుడు ఆ సినిమా మీదనే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. హనుమాన్ సినిమానే అంత బాగా తీసాడు ఇక సెకండ్ పార్ట్ ని ఎంత బాగా చూపిస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇది ఇలా ఉంటే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అంటూ వచ్చే సెకండ్ పార్ట్ లో ఎలాంటి కంటెంట్ తో వస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక రీసెంట్ గా ఈ సినిమాను చూసిన బాలయ్య ఈ సినిమా మీద స్పందిస్తూ ఈ స్టోరీ పట్టుకుని ముందుగా నా దగ్గరికి ఎందుకు రాలేదు అని ప్రశాంత్ వర్మ తో అన్నట్టు గా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి కథతో మోక్షజ్ఞ ను ఇంట్రడ్యూస్ చేస్తే బాగుండేదని బాలయ్య బాబు తన మనసులో మాటని ప్రశాంతవర్మతో చెప్పినట్టుగా ఇప్పుడు వార్తలైతే వస్తున్నాయి… నిజానికి మోక్షజ్ఞ కి ఈ కథ బాగా సరిపోయేది.
డెబ్యూ సినిమా కాబట్టి దేవుడిని బెస్ చేసుకుని నడిచే కథ కూడా కాబట్టి రెండు వైపులా ఈ సినిమా చాలా బాగా ప్లస్ అయ్యేది అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఈ సినిమాకి తేజ సజ్జా అయితేనే బాగా సెట్ అయ్యాడు మోక్షజ్ఞ అయితే ఎలా ఉండేదో మనం చెప్పలేము అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు ఈ సినిమా చూసి ప్రశాంత వర్మ తో తన మనసులో మాట బయట పెట్టినట్టుగా సమాచారం అయితే అందుతుంది…