Venkatesh : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటారు. ఇక సీనియర్ హీరోల్లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళు వాళ్ళ ఇమేజ్ ను కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా ఫ్యామిలీ సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన హీరో వెంకటేష్…ఇక వరుస సక్సెస్ లను అందుకుంటూ ‘విక్టరీ’ ని తన ఇంటి పేరు గా మార్చుకున్నాడు…ఇక తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న ఈయన ఫ్యామిలీ ఆడియన్స్ ను సినిమా థియేటర్ కి రప్పించడంలో దిట్ట… ఈయన సినిమాలను చూడడానికి యావత్ సినిమా ప్రేక్షకులందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో జీరో హేటర్స్ ఉండే ఒకే ఒక్క హీరో వెంకటేష్ అనే చెప్పాలి. ఆయన ఏ హీరోలను తక్కువ చేసి మాట్లాడడు. ఏ హీరోలను ఎక్కువ చేసి మాట్లాడడు. అందరితో సరి సమానంగా ఉంటూ ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక ముఖ్యంగా ఈగో లేని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వెంకటేష్ అనే చెప్పాలి. స్టార్ హీరో దగ్గర నుంచి అప్ కమింగ్ హీరోల వరకు ఎవరితో అయినా సరే మల్టీ స్టారర్ సినిమా చేయడానికి తను సిద్ధంగా ఉంటానని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి వెంకటేష్ ఈరోజు తన బర్త్ డే ని జరుపుకుంటున్నాడు. 64వ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా వెంకటేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనక సంబంధించిన కొన్ని వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక ముద్దుగా ఆయన అభిమానులు ‘వెంకీ మామ’ అని పిలుచుకుంటూ ఉంటారు. కాబట్టి వెంకీ మామ ఎమోషనల్ సీన్స్ అంటూ కొన్ని సీన్స్ ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ వాటిని వైరల్ చేసే ఉద్దేశ్యంలో తమ అభిమానులు ఉన్నారు.
ఇక ‘రాజా ‘ సినిమా నుంచి ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ సినిమా దాకా ప్రతి ఒక్క సినిమాలో ఉన్న ఎమోషనల్ సీన్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక వెంకటేష్ ఎమోషనల్ సీన్స్ లో నటించినా సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు కంటతడి పెట్టుకుంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ముఖ్యంగా సెంటిమెంట్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన వెంకటేష్ డిఫరెంట్ సినిమాలను కూడా చేసుకుంటూ వచ్చాడు. ఇక మొత్తానికైతే మాస్, యాక్షన్, కమర్షియల్, కామెడీ, థ్రిల్లర్స్ లాంటి చాలా జానర్స్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న ఆయన మరిన్ని ప్రయోగాలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తుండడం విశేషం…
ఇక రానా నాయుడు లాంటి బోల్డ్ కంటెంట్ తో ఉండే వెబ్ సీరీస్ ని కూడా చేసి బూతులను కూడా మాట్లాడిన ఆయన ఆర్టిస్ట్ అంటే అన్ని క్యారెక్టర్స్ ని చేయగలిగే కెపాసిటీ ఉండాలి. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ ని మెప్పించే అంత దమ్ము ఉండాలని చెబుతూ ఉంటాడు. ఇక దానివల్ల రానా నాయుడు సిరీస్ లో కూడా నటించానని కూడా చెప్పడం విశేషం…