Mana Shankar Vara Prasad Garu Tragedy: మెగా అభిమానుల్లో ఎప్పుడూ చూడనంత ఉత్సాహాన్ని ఈరోజు మనం చూడొచ్చు. చిరంజీవి(Megastar Chiranjeevi) సీనియర్ ఫ్యాన్స్ అనకాపల్లి నుండి అమెరికా వరకు నేడు విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వాళ్లకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే థియేటర్స్ ముందు పడిగాపులు గాచి, టికెట్స్ కోసం ఎలా అయితే క్యూ లైన్స్ లో నిల్చుకునేవారో, ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం ని తలపిస్తున్నారు. ఓపెనింగ్స్ కూడా అన్ని ప్రాంతాల్లో వేరే లెవెల్ లో ఉన్నాయి. కేవలం ఓవర్సీస్ నుండే ఈ చిత్రానికి పాతిక కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చేలా ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా రేంజ్ ఏమిటి అనేది. ఇలాంటి సంతోషకరమైన సందర్భంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.
అందరూ అభిమానులు లాగానే ఎంతో ఉత్సాహంతో హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అర్జున్ థియేటర్ లో సినిమా చూసేందుకు వచ్చిన ఒక మెగాస్టార్ వీరాభిమాని చనిపోవడం అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆ అభిమాని మృతదేహాన్ని థియేటర్ నుండి బయటకు తీసుకొస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఈ అభిమాని గుండెపోటు తో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన కి సంబంధించి మరికొన్ని వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. మరోపక్క మెగా ఫ్యాన్స్ ఇతని మృతి పట్ల సోషల్ మీడియా లో విచారం వ్యక్తం చేస్తున్నారు. అతని కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా మేము సహాయం గా ఉంటామని అంటున్నారు. చనిపోయిన వ్యక్తి పేరు, మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
చిరంజీవి సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి
హైదరాబాద్ – కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్లో, చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా చూస్తూ మృతి చెందిన అభిమాని
గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు pic.twitter.com/zgXIHmEB3L
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2026