https://oktelugu.com/

Keerthi Sutresh: త్వరలోనే యాంకర్ గా మారబోతున్న కీర్తి సురేష్…

Keerthi Sutresh: కీర్తి సురేష్… తెలుగులో నేను శైలజ సినిమాతో తెరపై తళుక్కున మెరిసిన ఈ భామ, మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది. క్యూట్ లుక్స్, కొంటె చూపులతో ఎంతో మంది యువకుల మనసుల్ని దోచేసింది కీర్తి. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళయాళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ” మహానటి ” సినిమాతో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 18, 2021 / 03:43 PM IST
    Follow us on

    Keerthi Sutresh: కీర్తి సురేష్… తెలుగులో నేను శైలజ సినిమాతో తెరపై తళుక్కున మెరిసిన ఈ భామ, మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది. క్యూట్ లుక్స్, కొంటె చూపులతో ఎంతో మంది యువకుల మనసుల్ని దోచేసింది కీర్తి. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళయాళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది కీర్తి. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. సావిత్రి జీవితకథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ” మహానటి ” సినిమాతో కీర్తి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది. మహానటి సినిమాలో కీర్తి నటనతో కట్టిపడేసిందనే చెప్పాలి.

    ఇక మహానటి సినిమా తర్వాత ఈ అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు కీర్తి సురేష్ తెలుగులో మూడు సినిమాలు చేస్తుండగా… తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. అలాగే మలయాళంలో ఒక సినిమా, కన్నడంలో ఒక సినిమాకు సంతకం చేసింది. ఇదిలా ఉండగా… కీర్తి సురేష్ యాంకర్ గా మారే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. కీర్తి సురేష్ తో ఒక ప్రముఖ ఛానల్ సంప్రదింపులు జరుపుతోందని… త్వరలోనే ఆమె యాంకర్ గా చేయనుందని టాక్ వినిపిస్తుంది.

    ఈ షో లో ఆమె ఇంటర్వ్యూలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన దర్శకులు, నిర్మాతలు ఇంకా పెద్ద స్టార్లతో ఆమె ఇంటర్వ్యూలు చేయనున్నట్లు సమాచారం. ఈ ఛానల్ దాదాపు నాలుగు భాషల్లో ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉందని… వారానికి రెండు నుంచి మూడు రోజుల వరకు షో టెలికాస్ట్ అయ్యేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం ఎపిసోడ్ లు పూర్తి చేసేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే దీనికి కీర్తి భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.