Nagarjuna: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిన్నటితరం హీరోలలో అక్కినేని నాగార్జున కి లేడీస్ మరియు యూత్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆరు పదుల వయస్సు దాటినా కూడా నాగార్జున కి ఉన్నంత గ్లామర్ మ్యానేజింగ్ స్కిల్స్ నేటి తరం యువ హీరోలకు కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..అంతే కాదు ఆయనతో పని చెయ్యాలని ప్రతి హీరోయిన్ కి ఉంటుంది..ముఖ్యంగా నాగార్జున గారికి రొమాంటిక్ సన్నివేశాలు చెయ్యడం అంటే బాగా ఇష్టం..ఆయనతో రొమాంటిక్ సన్నివేశాలు చెయ్యడానికి హీరోయిన్స్ కూడా అమితాసక్తిని చూపిస్తూ ఉంటారు.

కానీ ఒక హీరోయిన్ మాత్రం నాగార్జున గారితో రొమాంటిక్ సన్నివేశాలు చెయ్యడానికి బాగా ఇబ్బంది పడిందట..ఇక ఆ సినిమా దెబ్బకి ఈమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి బాలీవుడ్ లోనే స్థిరపడిపోయింది..ఆమె మరెవరో కాదు అయేషా టకియా..వీళ్లిద్దరు కలిసి గతం లో సూపర్ అనే సినిమాలో నటించారు..అందాల తార అనుష్క ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.
పూరి జగన్నాథ్ మరియు నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా కావడం, దానికి తోడు మాస్, శ్రీ రామదాసు వంటి వరుస హిట్స్ దూసుకెళ్తున్న సమయం లో వచ్చిన సినిమా కావడం తో ఈ చిత్రం పై అప్పట్లో భారీ అంచనాలు ఉండేవి..కానీ ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలం అయ్యింది..ఇక ఈ చిత్రం ఉన్న సాంగ్స్ అన్ని రొమాంటిక్ సాంగ్స్ అవ్వడం విశేషం..అప్పట్లో ఈ సాంగ్స్ గురించి పెద్ద జనాల్లో పెద్ద చర్చే నడించింది.

ఈ రొమాంటిక్ సాంగ్స్ లో అనుష్క ఒదిగిపొయ్యి చేసినప్పటికీ, అయేషా టకియా మాత్రం బాగా ఇబ్బంది పడిందట..తొలుత ఈ సాంగ్స్ లో నటించడానికి ఆమె నిరాకరించిన నాగార్జున ఆమెని ఒప్పించడం తో ఇబ్బందికరంగానే ఆ రొమాంటిక్ సాంగ్స్ చేసింది..ఇక ఈ సినిమా తర్వాత ఆమె మళ్ళీ టాలీవుడ్ పై కనెత్తి కూడా చూడలేదంటూ అప్పట్లో ఒక వార్త జోరుగా ప్రచారం అయ్యేది..ప్రస్తుతం ఆమె పదేళ్ల నుండి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తుంది.