Suresh Babu- Samantha: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా మీడియా ఛానల్ లో ప్రసారమవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోకి సంబంధించిన 5 వ ఎపిసోడ్ నిన్న రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది..ఈ ఎపిసోడ్ కి ముఖ్య అతిధులుగా అల్లు అరవింద్ , దగ్గుపాటి సురేష్ బాబు , రాఘవేంద్ర రావు మరియు కోదండ రామి రెడ్డి హాజరయ్యారు..ఈ ఎపిసోడ్ మొత్తం చాలా ఆసక్తికరమైన విషయాలతో ఫన్ తో సాగిపోయింది..అల్లు అరవింద్ మరియు సురేష్ బాబు మధ్య ఇంత మంచి సాన్నిహిత్యం ఉందా అని ఈ ఎపిసోడ్ చూసిన ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది.

ఇక బాలయ్య బాబు అల్లు అరవింద్ తో ‘మన కాంబినేషన్ లో ఇంకా సినిమా రాలేదు’ అని అనడం ,అల్లు అరవింద్ ‘నేను మిమ్మల్ని చిరంజీవి గారిని పెట్టి మల్టీస్టార్ర్ర్ తియ్యాలని చూస్తున్నా’ అని అనడం అప్పుడు బాలయ్య బాబు ‘అప్పుడు అది పాన్ వరల్డ్ మూవీ అవుతుంది’ అనడం..ఇలాంటి కామెంట్స్ అన్నీ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇక బాలయ్య ఈ తరం హీరోయిన్స్ లో మహానటి అని పిలవబడే అర్హత ఉన్న హీరోయిన్ ఎవరో రాయండి అని అడుగుతాడు..అప్పుడు సురేష్ బాబు మరియు అల్లు అరవింద్ ఇద్దరూ కూడా ‘సమంత’ పేరు రాస్తారు..సమంత ఆ వీడియో చూసి ఎంతో మురిసిపోయి తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పెట్టుకుంటుంది..నిజానికి సమంత నేటి తరం హీరోయిన్స్ లో మహానటి అనే చెప్పాలి..ఒక స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న రోల్స్ చెయ్యడం..చివరికి విలన్ రోల్స్ లో కూడా మెప్పించడం, బహుశా సమంత తప్ప నేటి తరం హీరోయిన్స్ కి ఎవరికీ సాధ్యపడలేదు.

అంతే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా సమంత కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది..ఇటీవలే ఆమె నటించిన యశోద సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది..గత కొంత కాలం నుండి మయోసిటిస్ అనే వ్యాధితో బాధ పడుతున్న సమంత చికిత్స నిమిత్తం సౌత్ కొరియా కి వెళ్ళింది..ఆమె సంపూర్ణంగా కోలుకొని ఎప్పటిలాగా అభిమానులని అలరించాలని కోరుకుందాము.