Producer Aditya Ram
Producer Aditya Ram : అందరి హీరోల కెరీర్స్ లో ఉన్నట్టుగానే ప్రభాస్ కెరీర్ లో కూడా సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లతో పాటు అట్టర్ ఫ్లాప్స్, డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నాయి. వాటిల్లో ‘ఏక్ నిరంజన్’ అనే సినిమా ఉంది. అప్పట్లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది. అంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్ ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’ అనే చిత్రం తెరకెక్కింది. కమర్షియల్ గా ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ లో ఆడినప్పటికీ, యూత్ ఆడియన్స్ కి మాత్రం బాగానే కనెక్ట్ అయ్యింది. మళ్ళీ అదే కాంబినేషన్ నుండి రావడం, విడుదలకు ముందు పాటలు కూడా పెద్ద హిట్ అవ్వడంతో ‘ఏక్ నిరంజన్’ పై అప్పట్లో భారీ అంచనాలు ఉండేవి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడంతో కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ చిత్ర నిర్మాత ఆదిత్య రామ్ సినిమాలు చేయడమే మానేసాడు.
అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన తమిళ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ఆదిత్య రామ్ కొనుగోలు చేసాడు. నిన్న చెన్నై లో దిల్ రాజు, ఆదిత్య రామ్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ విషయాన్నీ చెప్పుకొచ్చారు. ఆదిత్య రామ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నేను మీ అందరికీ గుర్తు లేనేమో, కానీ గతంలో ప్రభాస్ తో ‘ఏక్ నిరంజన్’ చిత్రాన్ని నిర్మించాను. ఆ సినిమా తర్వాత నేను సినీ రంగాన్ని వదులుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం లోకి అడుగుపెట్టాను. ఎందుకంటే అప్పట్లో అందులో ఎక్కువ లాభాలు ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఇన్నాళ్లకు ‘గేమ్ చేంజర్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాను. కచ్చితంగా ఈ చిత్రంతో మేము సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కుతామని నమ్మకం ఉంది. ఈ సినిమా విజయం సాధిస్తే, మళ్ళీ నేను మరికొన్ని చిత్రాలను కొంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
అయితే సోషల్ మీడియా ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య చాలా కాలం నుండి ఫ్యాన్ వార్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఆదిత్య రామ్ మాట్లాడిన ఈ మాటలను చూసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రభాస్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కొద్దిరోజుల క్రితమే ప్రముఖ హీరోయిన్ శ్రీయ ఎన్టీఆర్ తో కలిసి నా అల్లుడు చిత్రంలో నటించానని, ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అవ్వడంతో ఆ చిత్ర నిర్మాత ట్యాంక్ బండ్ లో దూకేశాడని, దాంతో మేము రెమ్యూనరేషన్స్ కూడా అడగలేదని చెప్పుకొచ్చింది. ఈ వీడియో ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని వెక్కిరించారు. దానికి ప్రతీకారంగా నేడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆదిత్యం రామ్ మాట్లాడిన ఈ వీడియో ని అడ్డుపెట్టుకొని ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు.
“After #Prabhas‘s #EkNiranjan, I quit producing films. After earning in real estate, I’m making a comeback after a long break to collaborate for #GameChanger in Tamil Nadu” – Aditya Ram Movies#RamCharan pic.twitter.com/O4poNPUdVm
— Daily Culture (@DailyCultureYT) November 5, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Famous producer aditya ram comments saying that i lost after doing a movie with prabhas ram charan should save me