Film Critic Passed Away: ప్రముఖ సినీ విమర్శకుల కులంలో గుడిపూడి శ్రీహరి భీష్ముడు వంటి వారు. అలాంటి సీనియర్ మోస్ట్ సినీ జర్నలిస్ట్ నేడు కన్నుమూశారు. గుడిపూడి శ్రీహరి గారి వయసు 88 ఏళ్ళు. గుడిపూడి శ్రీహరి గారు గతంలో సితార, ఈనాడు, హిందూ, ఫిలింఫేర్ వంటి అనేక ప్రముఖ పత్రికలకు అనేక సమీక్షలు రాశారు. సినిమాకి ఎలా రివ్యూ ఇవ్వాలో ఆయన రివ్యూస్ చూసి నేర్చుకోవచ్చు.

అంత గొప్పగా ఉంటాయి ఆయన రివ్యూస్. ఒక సినిమాకి కచ్చితమైన రేటింగ్ లు ఇవ్వడంలో ఆయన స్పెషలిస్ట్. అందుకే.. ఆయన అంటే.. ఎందరో స్టార్ హీరోలకు ప్రత్యేకమైన అభిమానం. అప్పట్లో రివ్యూస్ కి చాలా క్రేజ్ ఉండేది. అందుకే తెలుగు సినిమా విమర్శకుల్లో ఆయనది ప్రత్యేక స్థానం. ప్రేక్షకులు కూడా ఆ రోజుల్లో ఆయన సమీక్షల కోసం వేచి చూసేవారు.
Also Read: Janasena Jana Vani Program : పవన్ కళ్యాణ్ పై చిగురిస్తున్న ఆశలు
గుడిపూడి శ్రీహరి మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గుడిపూడి శ్రీహరి హఠాన్మరణం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేస్తూ… ప్రకటన విడుదల చేశారు. “పాత్రికేయ రంగంలో… ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో విశేష అనుభవం కలిగిన శ్రీ గుడిపూడి శ్రీహరి గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. తెలుగు, ఆంగ్ల పత్రికల్లో సినీ విమర్శకుడిగా శ్రీహరి గారు రాసిన వ్యాసాలు, సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి.

తెలుగు చిత్రసీమ ప్రస్థానంలోని అనేక ముఖ్య ఘట్టాలను ఆయన అక్షరబద్ధం చేశారు. సినిమాతోపాటు వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాలపై ‘హరివిల్లు’ శీర్షికతో చేసిన వ్యంగ్య రచనలు ఆయన నిశిత పరిశీలన తెలిపేవి. శ్రీ గుడిపూడి శ్రీహరి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను,” అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున గుడిపూడి శ్రీహరి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read: Godfather First Look Released: మెగా లుక్ అదిరింది.. మెగా ఫ్యాన్స్ కు ఇక పునకాలే !
[…] […]