Celebrity Sisters In Film Industry: వారసత్వం అన్నిచోట్లా ఉంటుంది. సక్సెస్ అయిన హీరోల తమ్ముళ్లు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తారు. అలాగే స్టార్ హీరోయిన్స్ చెల్లెళ్ళు కూడాను. మరి హీరోయిన్ గా సక్సెస్ అయితే వచ్చే హోదా, గౌరవం, లగ్జరీ లైఫ్ ఎవరు మాత్రం వదులుకుంటారు. అందుకే అక్కలు చూపిన మార్గం అనుసరిస్తూ చెల్లుళ్ళు కూడా వెండితెరపై తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కాగా హీరోయిన్స్ గా మారిన అక్కా చెల్లెళ్లు ఎవరో చూద్దాం.
హీరోయిన్ గా సాయి పల్లవిది ప్రత్యేక శైలి. మంచి నటిగా, డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు. ప్రేమమ్ మూవీతో హీరోయిన్ గా మారిన సాయి పల్లవికి ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. అక్క స్టార్ గా వెలిగిపోతుండగా ఆమె చెల్లి పూజా కన్నన్ సైతం హీరోయిన్ గా మారారు. చితిరై సెవ్వానమ్ మూవీతో పూజా వెండితెరకు పరిచయమయ్యారు.
మహేష్ – సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ వన్ నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా మారింది మోడల్ కృతి సనన్. ఈ పొడుగుకాళ్ల సుందరి బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగారు. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తున్న కృతి చెల్లెలు నుపూర్ సనన్ కూడా హీరోయిన్ గా మారారు. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు.
Also Read: Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ని దారుణంగా మోసం చేసిన యంగ్ హీరో
తెలుగు అమ్మాయిలు శివాత్మిక-శివాని హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అక్క శివాని కంటే ముందు శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2009లో విడుదలైన దొరసాని మూవీతో హీరోయిన్ గా మారారు. తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన అద్భుతం మూవీతో శివాని ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వీరు తెలుగుతో పాటు తమిళంలో చిత్రాలు చేస్తున్నారు. వీరు రాజశేఖర్, జీవిత కూతుళ్లన్న విషయం తెలిసిందే.
మరో స్టార్ కిడ్స్ శృతి హాసన్, అక్షర హాసన్ హీరోయిన్స్ గా మారారు. శృతి స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్, కోలీవుడ్ ని ఏలారు. ఆ మధ్య కెరీర్ కొంచెం డల్ అయినా తిరిగి పుంజుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ చిత్రాలలో నటిస్తున్నారు. ఇక అక్షర హాసన్ హిందీ మూవీ షమితాబ్ తో హీరోయిన్ అయ్యారు. అయితే అక్క శృతిలా సక్సెస్ కాలేదు.
చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. స్టార్ హీరోయిన్ గా దశాబ్దానికి పైగా వెండితెరను ఏలింది. 2020లో వివాహం చేసుకున్న కాజల్, ఇటీవల ఓ అబ్బాయికి జన్మనిచ్చారు. ఆమె నటించిన కొన్ని చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ సైతం హీరోయిన్ గా కొన్ని చిత్రాలు చేశారు. వరుణ్ సందేశ్ కి జంటగా ఏమైంది ఈవేళ? మూవీతో హీరోయిన్ అయ్యారు. సోలో మూవీతో మరో హిట్ కొట్టారు. తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అక్క కంటే ముందే 2017లో వివాహం చేసుకున్న నిషా.. నటిగా రిటైర్ అయ్యారు.
టాలీవుడ్ పరిచయం చేసిన హీరోయిన్స్ లో కత్రినా కైఫ్ ఒకరు. మల్లీశ్వరి మూవీతో హీరోయిన్ గా మారిన కత్రినా.. స్టార్ గా బాలీవుడ్ ని ఏలారు. ఇటీవల నటుడు విక్కీ కౌశల్ ని వివాహం చేసుకున్నారు. కత్రినా చెల్లెలు ఇసాబెల్లా కైఫ్ ‘టైం టు డాన్స్’ మూవీతో హీరోయిన్ గా మారారు.
బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ప్రియాంకా చోప్రా హిందీలో తక్కువగా చిత్రాలు చేస్తున్నారు. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకొని న్యూయార్క్ లో కాపురం పెట్టింది. ప్రియాంక చెల్లెలు పరిణితీ చోప్రా సైతం హీరోయిన్ గా బాలీవుడ్ లో చాలా చిత్రాలు చేశారు.
నిక్కీ గల్రాని-సంజనా గల్రాని సిస్టర్స్ కాగా ఇద్దరూ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో సునీల్ కృష్ణాష్టమి మూవీలో నటించిన నిక్కీ ఎక్కువగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో చేశారు. ఇటీవల నటుడు ఆదిని వివాహం చేసుకున్నారు. తెలుగులో బుజ్జిగాడు, సత్యమేవ జయతే వంటి చిత్రాల్లో నటించిన సంజనా గల్రాని సౌత్ లో అన్ని భాషల్లో నటించారు. ఇక డ్రగ్స్ ఆరోపణలపై సంజన జైలుపాలైన విషయం తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ సిస్టర్స్ గా కరిష్మా కపూర్-కరిష్మా కపూర్ ఉన్నారు. అక్క కరిష్మా స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్ళు బాలీవుడ్ ని ఏలారు. అక్క ఫార్మ్ కోల్పోయాక కరీనా కపూర్ రైజ్ అయ్యారు. కరీనా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. కరీనా లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చద్దా విడుదలకు సిద్ధమైంది.