Chandramohan passed away : ప్రముఖ నటుడు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచాడు. నాడు ఎన్టీఆర్ నుంచి నేటి కుర్ర హీరోల వరకూ అందరితో నటించిన దిగ్గజ సినీ కళామరత్నం వృద్ధాప్యంతో కన్నుమూసింది. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చంద్రమోహన్ పరిస్థితి విషమించి మరణించారు.
చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌రావు. ఈయన 1945 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించాడు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ నటులలో లెజండరీ స్థానాన్ని సంపాదించుకున్న అతి తక్కువ మందిలో ఒకరు చంద్ర మోహన్..ఈయన నేటి తరం ప్రేక్షకులకు కేవలం ఒక మంచి క్యారక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే తెలుసు..కానీ ఒకప్పుడు ఈయన 175 సినిమాలకు పైగానే హీరో గా నటించాడని విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు..మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా ఆయన సినిమాల్లో అప్పట్లో సెకండ్ హీరో గా చేసినవారే.
అంతే కాదు..హీరోయిన్లు ఈయన పక్కన నటిస్తే రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతారు అని కూడా అప్పట్లో ఈయనకి పేరు ఉండేది..అతి లోక సుందరి శ్రీదేవి గారు కూడా తన మొదటి చిత్రాన్ని చంద్ర మోహన్ గారితోనే చేసారు..వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ’16 ఏళ్ళ వయస్సు’ అనే సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసింది..ఆలా హీరో గా ఎన్నో మైల్ స్టోన్స్ ని అందుకున్న చంద్ర మోహన్..అప్పటి యువ హీరోల ధాటికి తట్టుకోలేక..వరుస ఫ్లాప్స్ ఎదురై హీరో గా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది.
కాలానికి తగ్గట్టుగా నడుచుకోవడం చంద్రమోహన్ గారి స్పెషలిటీ..హీరో గా అవకాశాలు రాకపొయ్యేసరికి క్యారక్టర్ ఆర్టిస్టు అవతారం ఎత్తాడు..క్యారక్టర్ ఆర్టిస్టుగా ఈయన హీరో కంటే ఎక్కువ సక్సెస్ ని చూసాడు..సుమారు 800 సినిమాల్లో ఆయన క్యారక్టర్ ఆర్టిస్టు గా చేసాడు..కామెడీ పుట్టించడం లో కానీ సెంటిమెంట్ పండించడం లో కానీ చంద్ర మోహన్ గారి స్పెషాలిటీ వేరు..కానీ ఆయన గత కొంతకాలం నుండి సినిమాల్లో నటించడం లేదు..చివరిసారిగా ఆయన కనిపించిన చిత్రం ఆక్సిజన్..ఈ చిత్రం 2017 వ సంవత్సరం లో విడుదలైంది..ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన ఏ సినిమాలో కూడా నటించలేదు..అకస్మాత్తుగా చంద్ర మోహన్ గారు సినిమాలు మానేసాడు ఏంటి..ఆయన ఆరోగ్యం బాగానే ఉందా అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలైయ్యాయి. చివరకు వృద్ధాప్యంతో అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.