Homeఎంటర్టైన్మెంట్Family Star: ఫ్యామిలీ స్టార్ నుండి రొమాంటిక్ సాంగ్ నందనందన... దేవరకొండతో మృణాల్ కెమిస్ట్రీ కేక!

Family Star: ఫ్యామిలీ స్టార్ నుండి రొమాంటిక్ సాంగ్ నందనందన… దేవరకొండతో మృణాల్ కెమిస్ట్రీ కేక!

Family Star: విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. దర్శకుడు రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే థియేటర్స్ సమస్య నేపథ్యంలో విడుదల వాయిదా వేశారు. ఇటీవల ఏప్రిల్ 5న సమ్మర్ కానుకగా విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. నిజానికి అది దేవర మూవీ విడుదల తేదీ. దేవర వాయిదా పడనుందని విశ్వసనీయ సమాచారం అందడంతో ఫ్యామిలీ స్టార్ నిర్మాతలు ఆ తేదీపై కన్నేశారు.

విడుదలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రొమోషన్స్ షురూ చేశారు. నేడు ఫ్యామిలీ స్టార్ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. నందనందన పేరుతో విడుదలైన ఈ రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంది. సాంగ్ లో విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాగూర్ మధ్య కెమిస్ట్రీ అదిరింది. గోపి సుందర్ మ్యూజిక్ అందించగా అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చారు. ఇక స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు.

నందనందన సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. గతంలో విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో విడుదలైన గీత గోవిందం సంచలన విజయం సాధించింది. దాంతో ఈ కాంబినేషన్ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన టైటిల్ ప్రోమో వైరల్ అయ్యింది. ‘ఐరనే వంచాలా ఏంటీ?’ అని విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ని ట్రోల్ చేశారు. ట్రోల్స్ ని కూడా విజయ్ దేవరకొండ ప్రచారంగా మార్చుకున్నాడు.

ఇక విజయ్ దేవరకొండ క్లీన్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఆయన గత చిత్రం ఖుషి ఓ మోస్తరు విజయం నమోదు చేసింది. కొన్ని ఏరియాల్లో నష్టాలు మిగిల్చింది. మరోవైపు మృణాల్ ఠాకూర్ వరుస విజయాలతో జోరు మీదుంది. తెలుగులో ఆమె మొదటి చిత్రం సీతారామం అద్భుత విజయం సాధించింది. గత ఏడాది నానికి జంటగా నటించిన హాయ్ నాన్న సైతం హిట్ కొట్టింది. కాబట్టి మృణాల్ ఠాగూర్ తన లక్ తో విజయ్ దేవరకొండను హిట్ ట్రాక్ ఎక్కించడం ఖాయమని చెప్పొచ్చు…

 

RELATED ARTICLES

Most Popular