Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ హౌస్ లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అని మరోసారి ఈరోజు రుజువైంది..రోజుకో ట్విస్టు తో ఎవ్వరు ఊహించని విధంగా సాగుతున్న ఈ సీజన్ లో ఈ వారం కెప్టెన్సీ టాస్కు ఎంతో ఉత్కంఠ నడుమ సాగింది..కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రాణం పెట్టి ఆడారు..ఈ క్రమం లో భావోద్వేగాలు మరియు కోపతాపాలు కూడా ఇంటి సభ్యుల మధ్య జరిగాయి..ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్కులో విజేతగా నిలిచి ఫైమా ఇంటి కెప్టెన్ అయ్యింది.

ఆమె ఇంటి కెప్టెన్ అయ్యే ముందు ఇనాయ తో టాస్కు విషయం లో పెద్ద గొడవ పెట్టుకుంది..బిగ్ బాస్ ఇంటి పై కప్పు ఎగిరిపొయ్యెలా వీళ్లిద్దరు ఒకరిమీద ఒకరు అరుచుకున్నారు..కానీ ఫైమా ఇంటి కెప్టెన్ అవ్వగానే ఇనాయ కంగ్రాట్స్ అని నవ్వుతు చెప్పడం తో ఫైమా కంటతడి పెట్టుకొని ఇనాయ ని గట్టిగ హాగ్ చేసుకుంటుంది..ఇంటి సభ్యులందరు ఈ దృశ్యాన్ని చూసి షాక్ కి గురైయ్యారు.
ఇక హౌస్ లో మొదటి నుండి జాన్ జిగిరి దోస్తులుగా కొనసాగిన రేవంత్ , శ్రీహాన్ మరియు శ్రీ సత్య మధ్య గొడవలు మొదలయ్యాయి..కెప్టెన్సీ టాస్కు లో రేవంత్ మరియు శ్రీ సత్య మధ్య చిన్న వాదనలు మొదలయ్యాయి..అది పెరిగి పెద్దది అయ్యి రేవంత్ సంచలక్ గా మారినప్పుడు మరింత ఎక్కువ అయ్యింది..ఈరోజు వరస్ట్ కంటెస్టెంట్ ని ఇంటి సభ్యులు నామినెటే చేసేదాంట్లో భాగంగా శ్రీ సత్య రేవంత్ ని నామినేట్ చేస్తుంది..సంచాలక్ గా నువ్వు పూర్తిగా విఫలం అయ్యావు అంటూ కారణం చెప్తుంది..అదే కాకుండా నిన్న రాత్రి నువ్వు నేను లేనప్పుడు నా టాపిక్ తీసుకొని రావడం నాకు నచ్చలేదు అని చెప్తుంది శ్రీ సత్య.

ఇక రేవంత్ వంతు వచ్చినప్పుడు ఆయన కూడా శ్రీ సత్య ని వరస్ట్ కంటెస్టెంట్ గా నామినేట్ చేస్తాడు..ఆలా వీళ్లిద్దరి మధ్య కాసేపు వాదనలు నడిచాయి..మరి వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన ఈ చిన్న గ్యాప్ రాబొయ్యే రోజుల్లో పుడుతుందా..లేదా కొనసాగుతూ ముందుకి పోతుందా అనేది చూడాలి.