Bigg Boss 6 Telugu- Faima: గత కొద్దీ వారాల నుండి బిగ్ బాస్ సీజన్ 6 లో ఎలిమినేషన్స్ గురించి కాస్త కాంట్రవర్సీ నడుస్తుంది..హౌస్ లో బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరిగా వెళ్లిపోతున్నారని..సోషల్ మీడియా జరిగే అత్యధిక పొలింగ్స్ లో అతి తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్స్ ఇంట్లోనే ఉంటున్నారు కానీ..ఎవరిని అయితే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని అనుకుంటున్నామో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారని..ఎక్కడో ఎదో తేడా జరుగుతుందని నెటిజెన్ల ఆరోపిస్తున్నారు.

గత రెండు వారాల్లో అర్జున్ కళ్యాణ్ మరియు సూర్య వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం వల్లే ఇలాంటి నెగటివ్ కామెంట్స్ జోరు ఊపందుకున్నాయి..అయితే ఈ వారం కూడా అలాంటి ఎలిమినేషన్ ఉండబోతుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి రేవంత్, ఇనాయ సుల్తానా, రోహిత్ , మెరీనా, శ్రీ సత్య , కీర్తి ,బాలాదిత్య , ఆది రెడ్డి మరియు గీతూ ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే.
ప్రస్తుతం నమోదైన వోటింగ్ ప్రకారం ఈ వారం హౌస్ నుండి ఫైమా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది..మొదటి రోజు నుండి నేటి వరుకు ఎక్కడా తగ్గకుండా ఆడుతున్న అతి తక్కువమంది కంటెస్టెంట్స్ లో ఒకరు ఫైమా..ఎంటర్టైన్మెంట్ పంచడం లో కానీ..టాస్కులు ఆడడం లో కానీ ఫైమా సూపర్ అనే చెప్పాలి..అవతల వ్యక్తి ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ అయ్యినప్పటికీ కూడా అసలు వెన్ను చూపని ధైర్యం ఫైమా సొంతం.

అలాంటి కంటెస్టెంట్ కి తక్కువ ఓట్లు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది..అయితే గత రెండు వారాల నుండి సోషల్ మీడియా లో జరుగుతున్న పోలింగ్స్ కి పూర్తి వ్యతిరేకంగా ఎలిమినేషన్స్ జరుగుతుండడంతో,ఆ యాంగిల్ లో ఫైమా కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అని తెలుస్తుంది..చూడాలి మరి ఈ వారము మనం ఎలాంటి ట్విస్ట్స్ ని చూడబోతున్నాము అనేది.