https://oktelugu.com/

Aavesham: ఓటీటీలో ఫహద్ ఫాజిల్ క్రేజీ మూవీ ఆవేశం… కానీ తెలుగు ఆడియన్స్ కి నిరాశే!

ఆవేశం సినిమా రూ. 30 కోట్లతో తెరకెక్కించారు. ఏప్రిల్ 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా రిలీజైన నెల రోజులకే ఒటిటి లోకి రావడం విశేషం.

Written By:
  • S Reddy
  • , Updated On : May 9, 2024 3:09 pm
    Fahad Fazil crazy movie Aavesham in OTT

    Fahad Fazil crazy movie Aavesham in OTT

    Follow us on

    Aavesham: మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ ‘ ఆవేశం ‘ ఓటీటీ లోకి వచ్చేసింది. పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కాగా ఈ చిత్రం ఎక్కడ స్ట్రీమ్ అవుతుందో చూద్దాం. విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ ఆవేశం మూవీ తో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఫహాద్ ఫాజిల్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి.

    ఆవేశం సినిమా రూ. 30 కోట్లతో తెరకెక్కించారు. ఏప్రిల్ 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా రిలీజైన నెల రోజులకే ఒటిటి లోకి రావడం విశేషం. ఆవేశం మూవీ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. ప్రస్తుతం మలయాళం లో స్ట్రీమ్ అవుతున్న ఉన్న చిత్రం .. త్వరలో తెలుగు డబ్బింగ్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకింత తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచే అంశం.

    ఆవేశం డిజిటల్ హక్కులు అత్యధిక ధరకు అమెజాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 35 కోట్లు చెల్లించి డిజిటల్ రైట్స్ అమెజాన్ సొంతం చేసుకుందట. దీంతో ఓటీటీ డిజిటల్ రైట్స్ ద్వారా అత్యధిక మొత్తం పొందిన మళయాళ మూవీ గా ఆవేశం చిత్రం రికార్డు సృష్టించింది. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ తో పాటు హిప్ స్టార్, మిథున్ జై, రోషన్ షానవాజ్, సాజిన్ గోపు, మన్సూర్ అలీ ఖాన్, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషించారు.

    ఈ చిత్రానికి జీతూ మాధవన్ దర్శకత్వం వహించారు. ఫహాద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్, అన్వర్ రషీద్ అన్వర్ బ్యానర్లపై తెరకెక్కింది. సుసిన్ శ్యామ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఇక ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన మలయాళ చిత్రాల్లో ఆవేశం మూడో స్థానంలో నిలిచింది. మంజుమ్మేల్ బాయ్స్ మొదటి స్థానం దక్కించుకుంది. పృథ్వి రాజ్ సుకుమారన్ ‘ ఆడుజీవితం ‘ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆవేశం మూడో స్థానంలో నిలవడం విశేషం.