Facebook Ad Viral Girl: సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగించే వారికి.. చిత్రంలో కనిపిస్తున్న అమ్మాయి సుపరిచితమే. ఏదో ఒక సందర్భంలో ఈ అమ్మాయిని చూసే ఉంటారు. చాలామంది ఈమె ఒక సెలబ్రిటీ అని.. అందువల్లే ఇలా కనిపిస్తుందని అనుకుంటారు. వాస్తవానికి ఈమె ఎవరో తెలుసుకునే ప్రయత్నాన్ని చాలామంది చేశారు. అయితే అందులో మీరు కూడా ఉంటే ఒకసారి ఈ కథనాన్ని చదవండి..
Also Read: కింగ్ డమ్ ఫస్ట్ రివ్యూ… విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయొచ్చా?
ఇంటర్నెట్లో ఈ మిస్టరీ గర్ల్ చాలా ఫేమస్. అయితే ఈమె మోడల్ కాదు.. ఈ అమ్మాయి యూట్యూబ్, ఫేస్ బుక్, వంటి సామాజిక మాధ్యమాలలో వెనక్కి తిరిగి కనిపిస్తుంది. ఈ అమ్మాయి నవ్వుతున్న ఫోటో ఉన్న యాడ్ చాలా ఫేమస్. ఈ అమ్మాయి పేరు నుపూర్ చాబ్రా. ఈమె జన్మించింది భారతదేశంలో.. ఉన్నత చదువులు చదివి అమెరికాలో స్థిరపడ్డారు. అంతేకాదు ఫేస్బుక్ సంస్థలో టెక్నికల్ రిక్రూటర్ గా పనిచేశారు. అదే సంస్థలో మార్కెటింగ్ మీడియా మేనేజర్ గా కూడా పనిచేశారు. అందంగా ఉండడం.. అందులోనూ అద్భుతమైన నవ్వుతూ ఉండడంతో ఆమెకు ఒక ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. పేదరికంలో మగ్గుతున్న చిన్నపిల్లలకు సహాయం చేసే స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన ప్రకటన అది. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం ఆమె ఆ ప్రకటనలో నటించారు. ఆ తర్వాత ఆ యాడ్ ద్వారా ఆమె ఫేమస్ అయిపోయారు. అయినప్పటికీ ఆమె వివరాలు పెద్దగా కనిపించలేదు. కొంతకాలానికి ఆమె వివరాలు బయటకు వచ్చాయి.
Also Read: మహేష్ బాబు ‘హరి హర వీరమల్లు’ కథని రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా!
2020లో నుపూర్ సాహిల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరు అమెరికాలో సంతోషంగా జీవిస్తున్నారు. వారిద్దరికీ పిల్లలు ఉన్నారా? లేదా? అనే విషయాలపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆమె కేరింగ్ హాండ్స్ ఫర్ చిల్డ్రన్స్ అనే సంస్థకు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. లెట్స్ హంగిన్ అనే మరో సంస్థకు ఆమె సహ వ్యవస్థాపకురాలుగా కొనసాగుతున్నారు. అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు ప్రకారం ఆమె ఇన్ స్టాగ్రామ్ ఐడి noopur అని ఉంటుంది. కాకపోతే ఆమె ఎకౌంటు పూర్తిగా ప్రైవేట్ లో ఉంది. కాకపోతే కేరింగ్ హ్యాండ్ ఫర్ అనే చిన్నపిల్లల సంరక్షణ సంబంధించిన స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు కాబట్టి.. అప్పుడప్పుడు ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాలలో కనిపిస్తుంటారు.