Extra Ordinary Man Twitter Review: హీరో నితిన్ హిట్ కొట్టి మూడేళ్లు అవుతుంది. భీష్మ అనంతరం ఆయన సక్సెస్ చూడలేదు. ఈ క్రమంలో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. శ్రీలీల జంటగా నటించగా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 8న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ముగియగా టాక్ బయటకు వచ్చింది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీపై ప్రేక్షకుల అభిప్రాయం ఏమిటో చూద్దాం…
రచయితగా వక్కంతం వంశీ అనేక హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. దర్శకుడు కావాలన్న ఆయన మొదటి ప్రయత్నం బెడిసికొట్టింది. అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ తెరకెక్కించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ అయ్యింది. ఆ దెబ్బతో ఐదేళ్లు డైరెక్షన్ కి దూరమయ్యాడు. మరోసారి నితిన్ తో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. మరోవైపు నితిన్ కూడా వరుస ప్లాప్స్ తో డీలా పడ్డాడు. భీష్మ తర్వాత నితిన్ కి హిట్ పడలేదు.
మరి వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఎలా ఉందంటే… ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ దర్శకుడు ఎంగేజింగ్ గా నడిపించాడు. కామెడీ సీన్స్ బాగున్నాయి. నితిన్ కామెడీ టైమింగ్ అలరిస్తుంది. స్టార్ హీరోల రిఫరెన్స్, స్పూఫ్స్ తో దర్శకుడు కామెడీ రాసుకున్నాడు. అది కొంత మేర వర్క్ అవుట్ అయ్యింది. హీరో క్యారెక్టర్ జూనియర్ ఆర్టిస్ట్ కావడంతో బాహుబలి, శ్రీమంతుడుతో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాల రిఫరెన్స్ లు వాడారు.
సెకండ్ హాఫ్ నుండి సినిమా కొంచెం సీరియస్ ట్రాక్ తీసుకుంటుంది. దర్శకుడు హీరోలోని మరో కోణం ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అయితే అది అంతగా మెప్పించలేదు. ఆకట్టుకోని స్క్రీన్ ప్లే, అంచనా వేయగల స్టోరీ థ్రిల్ కలిగించలేకపోయాయి. విలన్ క్యారెక్టర్ చాలా వీక్ గా ఉంది. హరీష్ జయరాజ్ మ్యూజిక్, బీజీఎమ్ మెప్పించలేదని ఆడియన్స్ టాక్. రావు రమేష్ కామెడీ ట్రాక్, చివర్లో రాజశేఖర్ ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్, నితిన్ యాక్టింగ్ కి పాజిటివ్ మార్క్స్ పడుతున్నాయి. శ్రీలీల పాత్ర కూడా సోసో గా ఉందని అంటున్నారు. మొత్తంగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తుంది.
Don't Believe in Reviews apart from Villain and some flaws. #ExtraOrdinaryMan Movie is paka comercial Comedy entertainer #Nithiin comedy worked out very well #RaoRamesh was brilliant
Don't Miss in Theaters surely u guys will enjoy👍💯#Nithin #HiNanna#ExtraOrdinaryMan pic.twitter.com/z49GTforbe— …. 🧢 (@RobinHood_9_) December 8, 2023
#ExtraOrdinaryMan An Outdated Commercial Movie that is strictly below par!
A few comedy bits work here and there but a lot of it irritates as it banks on Spoofs/Parodies and feels over the top. Director tried to take the movie on a fun route but he fails to write a cohesive…
— Venky Reviews (@venkyreviews) December 8, 2023
#ExtraOrdinaryMan (Telugu|2023) – THEATRE.
Nithiin Energetic Screen Presence. Useless Cameo by Sreeleela & Rajsekar. Weak Villain. Rao Ramesh Gud. Poor BGM, Songs & Story. Dance ok. Screenplay lacks d punch & no emotion conveyed. Just Couple of comedy scenes r fun. NOTHING MUCH! pic.twitter.com/63Hni0EWNT
— CK Review (@CKReview1) December 8, 2023
https://twitter.com/DarlingMahesh99/status/1732960984518791230