సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా ఏ అంశం పై ఉండనుంది ? టైటిల్ ను బట్టి రాజకీయ అంశాల పై ప్రధానంగా సినిమా సాగుతుందా ? సిని వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని.. సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రదానంగా ప్రస్తావించబోతున్నారని సినీ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రంలోని కథ మరియు మహేష్ పాత్రకు సంబంధించిన ఊహాగానాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు ఆ రూమర్స్ సారాంశం. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ సినిమా నడుస్తోందట.
అలాగే ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్ గా నటించనున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Exciting story for mahesh babu parasuram movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com