Mokshagna:బాలయ్య అభిమానులు ఎప్పటి నుండో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ లెగసీని బాలయ్య నిలబెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. అయితే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ నందమూరి వారసుడిగా బరిలో దిగాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. చాలా కాలంగా మోక్షజ్ఞ హీరో కావాలనే డిమాండ్ ఉంది. అందుకే మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు ప్రతి ఏడాది ఘనంగా చేస్తున్నారు. అభిమాన సంఘాలు నిర్వహించే జన్మదిన వేడుకల్లో మోక్షజ్ఞ పాల్గొనడం జరిగింది.
కానీ నటుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వడం లేదు. మోక్షజ్ఞ వయసు మూడు పదులకు దగ్గరవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్లకే హీరో అయ్యాడు. 40 ఏళ్లకు గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. మోక్షజ్ఞ హీరోగా మారి పదేళ్లు దాటి పోవాల్సింది. అదే జరిగితే మోక్షజ్ఞ కూడా స్టార్ గా ఒక ఇమేజ్ తెచ్చుకునేవాడు. నందమూరి కుటుంబాన్ని అమితంగా ప్రేమించే వాళ్ళందరూ మోక్షజ్ఞ హీరో కావాల్సిందే అంటున్నారు.
ఇక బాలయ్యను ఈ ప్రశ్న పలుమార్లు అడగడం జరిగింది. ఆయన ప్రతి ఏడాది ఈ ఏడాది మోక్షజ్ఞ హీరోగా సినిమా చేస్తున్నామని చెప్పుకొస్తున్నాడు. ఏళ్ళు గడిచిపోతున్నాయని కానీ ఆ తరుణం రావడం లేదు. అదే సమయంలో మోక్షజ్ఞకు నటుడు కావడం ఇష్టం లేదనే వాదన ఉంది. నేను వ్యాపారాలు చేసుకుంటానని మోక్షజ్ఞ తేల్చి చెప్పేశాడట. బాలయ్య మాత్రం పట్టుబట్టి మోక్షజ్ఞను హీరో చేయాలని అనుకుంటున్నాడట. ఈ పుకార్ల నేపథ్యంలో ఓ అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.
యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ మోక్షజ్ఞ ఎంట్రీపై స్పందించారు. మోక్షజ్ఞ నాకు ఫ్రెండ్. అతడు త్వరలో హీరో అవుతాడు. దాని కోసం సన్నద్ధం అవుతున్నాడు. నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. మోక్షజ్ఞ, నేను కలిసి థియేటర్స్ లో సినిమాలు కూడా చూశాము, అన్నాడు. అలాగే మోక్షజ్ఞ మంచి నటుడు. అతడు కనుబొమ్మలతో నటించగలడు. నందమూరి ఫ్యామిలీ నుండి మరో మంచి హీరో అవుతాడని చెప్పుకొచ్చాడు. బెల్లకొండ గణేష్ ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ లో జోష్ నింపింది.