Homeఎంటర్టైన్మెంట్Actress Lakshmi: పెళ్లయ్యాక అలాంటి పనులు చేసింది.. ఈ సీనియర్ నటిపై భర్త సంచలన ఆరోపణలు

Actress Lakshmi: పెళ్లయ్యాక అలాంటి పనులు చేసింది.. ఈ సీనియర్ నటిపై భర్త సంచలన ఆరోపణలు

Actress Lakshmi: సీనియర్ నటి లక్ష్మి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించింది. వందల చిత్రాల్లో నటించారు. లక్ష్మి సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. ఆమె తండ్రి వైవీ రావు దర్శకుడు, నిర్మాత, రచయిత, ఎడిటర్ కూడాను. లక్ష్మి తల్లి కుమారి రుక్మిణి హీరోయిన్. తల్లి వారసత్వం పుణికిపుచ్చుకున్న లక్ష్మి సిల్వర్ స్క్రీన్ పై రాణించింది. లక్ష్మి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోవడం విశేషం. నాలుగుసార్లు నంది అవార్డ్స్ గెలుచుకున్న లక్ష్మి కెరీర్లో అద్భుతమైన చిత్రాలు చేసింది.

లక్ష్మి 9 ఫిలిం ఫేర్ సౌత్ అవార్డ్స్ అందుకుంది. అలాగే ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. పదుల సంఖ్యలో లక్ష్మి అవార్డులు గెలుచుకున్నారు. హీరోయిన్ గా రిటైర్ అయ్యాక లక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. మురారి, ప్రేమించు, జీన్స్, లాహిరి లాహిరి లాహిరిలో చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేశారు. ఈ మధ్య కాలంలో లక్ష్మి చేసిన చెప్పుకోదగ్గ చిత్రం ఓ బేబీ. సమంత హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో లక్ష్మి కథలో కీలకమైన పాత్ర చేసింది.

ఓ బేబీ సూపర్ హిట్ కాగా లక్ష్మి గురించి జనాలు మరోసారి చర్చించుకున్నారు. అలాగే నాని గ్యాంగ్ లీడర్ లో కూడా ఆమె పాత్రకు చాలా వెయిట్ ఉంటుంది. సమంత-విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషిలో లక్ష్మి నటించిన విషయం తెలిసిందే. నటిగా లక్ష్మి వైభవం చూశారు. ఇప్పటికీ ఆమెకు డిమాండ్ తగ్గలేదు. మంచి మంచి పాత్రలు వరిస్తున్నాయి. వ్యక్తిగత జీవితం మాత్రం సవ్యంగా సాగలేదు. ఆమెకు ఏకంగా మూడు పెళ్లిళ్లు అయ్యాయి. 1969లో భాస్కరన్ అనే వ్యక్తిని లక్ష్మి వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి. 1974లో విడాకులు తీసుకుని విడిపోయారు.

అనంతరం నటుడు మోహన్ శర్మను వివాహం చేసుకుంది. 1975లో వివాహం కాగా ఐదేళ్లకు 1980లో విడిపోయారు. లక్ష్మితో మోహన్ శర్మ విడిపోయి చాలా కాలం అవుతుండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కీలక ఆరోపణలు చేశాడు. పెళ్లి తర్వాత అణిగిమణిగి ఉంటానని లక్ష్మి చెప్పింది. కానీ ఆమె అనేక తప్పులు చేసింది. అవన్నీ నేను చెప్పలేనని లక్ష్మి పై కీలక ఆరోపణలు చేశాడు. మోహన్ శర్మ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మోహన్ శర్మకు విడాకులు ఇచ్చాక లక్ష్మి నటుడు శివ చంద్రన్ ని వివాహం చేసుకుంది.

RELATED ARTICLES

Most Popular