Chikiri Chikiri Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై ప్రస్తుతం మార్కెట్ లో మామూలు రేంజ్ హైప్ లేదు. ఎందుకంటే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేసిన గ్లింప్స్ వీడియో, అదే విధంగా రీసెంట్ గా విడుదల చేసిన ‘చికిరి..చికిరి’ వీడియో సాంగ్ ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని ఉర్రూతలు ఊగించాయి. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఎక్కడ చూసింహ ‘చికిరి..చికిరి’ మేనియా నే కనిపిస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నార్త్ ఇండియా లోని ఆడియన్స్, ఇతర దేశాలకు చెందిన మూవీ లవర్స్, ఇలా ప్రతీ ఒక్కరు ఈ పాటకు చిందులు వేస్తున్నారు. సాధారణంగా ఇలాంటివి సినిమా విడుదలయ్యాక ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ చిత్రానికి విడుదలకు ముందే జరిగింది. అందువల్ల సినిమా పై బజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఇందులో చరణ్ బ్యాట్ పట్టుకొని వేసే స్టెప్ పై చాలా కాంట్రవర్సి ఉంది.
ఈ స్టెప్ కాపీ అని, ఆగస్టు లో విడుదలైన ‘వార్ 2’ లో జూనియర్ ఎన్టీఆర్ ‘సలామ్ అనాలి ‘ పాటలో వేసిన స్టెప్పులను కాస్త అటు ఇటు చేసి వాడేశారని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, రామ్ పోతినేని ఫ్యాన్స్ కూడా పెద్ద గోల చేసేసారు. ఎందుకంటే ‘వారియర్’ చిత్రం లో రామ్ ఒక పాటకు వేసిన స్టెప్పులు అట ఇవి. దానిని కాస్త మార్చి పెద్ది లో పెట్టారని అంటున్నారు. కేవలం టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఈ చికిరి చికిరి హుక్ స్టెప్ పై విమర్శలు చేస్తున్నారు. విక్కీ కౌశల్ ‘తౌబా..తౌబా’ సాంగ్ లో ఇలాంటి స్టెప్పులే వేసాడని, దానిని కాపీ కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇంతమంది ఆ స్టెప్పు వేసినప్పటికీ, రామ్ చరణ్ వేస్తేనే ఎందుకు ఇంతటి గ్లోబల్ రీచ్ వచ్చింది?, రామ్ చరణ్ వాళ్ళ కంటే బాగా వేశాడా?, లేదంటే అదృష్టం అలా కలిసొచ్చిందా అని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాటలో రామ్ చరణ్ ఎక్కడా కూడా డ్యాన్స్ వేస్తున్నట్టు అనిపించదు. నిజంగా ఆనందం వేస్తే ఒక కుర్రాడు ఆనందం తో ఎంజాయ్ చేస్తూ ఎలా చిందులు వేస్తాడో, అలా ఉంటుంది ఆయన వేసిన స్టెప్పులు. అందుకే సామాన్యులు ఆ హుక్ స్టెప్స్ కి బాగా కనెక్ట్ అయ్యారని విశ్లేషకులు అంటున్నారు. మరికొంతమంది అయితే AR రెహమాన్ అందించిన ట్యూన్ అదిరిపోయింది, అందుకే ఆ పాటతో పాటు ఈ స్టెప్పులు కూడా వైరల్ అయ్యాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.
https://www.youtube.com/shorts/tys0xhIX81k?feature=share