Akhanda Movie: ‘అఖండ’ సినిమా పై అందరి మాట అదే !

Akhanda Movie: అఖండ సినిమా ఎలా ఉంది ? ఏమిటి.. సినిమా కూడా బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రశ్న ఇప్పుడు అర్ధరహితం కదా. కానీ, అఖండ సినిమా ఎలా ఉంది అని ప్రతి ప్రేక్షకుడు.. అంటే సినిమా చూసిన వాడు, సినిమా చూడని వాడు అడుగుతున్నాడట. అయితే, అందరూ చెబుతున్న మాట.. సినిమాలో కథ లేదు అని. నిజంగానే కథ లేదు. అఖండ అనే బలమైన పాత్ర మాత్రమే ఉంది, అంతే. ఇక […]

Written By: Shiva, Updated On : December 8, 2021 3:28 pm
Follow us on

Akhanda Movie: అఖండ సినిమా ఎలా ఉంది ? ఏమిటి.. సినిమా కూడా బ్రేక్ ఈవెన్ దిశగా వెళ్తున్న క్రమంలో ఈ ప్రశ్న ఇప్పుడు అర్ధరహితం కదా. కానీ, అఖండ సినిమా ఎలా ఉంది అని ప్రతి ప్రేక్షకుడు.. అంటే సినిమా చూసిన వాడు, సినిమా చూడని వాడు అడుగుతున్నాడట. అయితే, అందరూ చెబుతున్న మాట.. సినిమాలో కథ లేదు అని. నిజంగానే కథ లేదు. అఖండ అనే బలమైన పాత్ర మాత్రమే ఉంది, అంతే.

Akhanda Movie

ఇక గొప్ప కథలు, అద్భుత కథనాలు సినిమాలో లేవు. ఈ విషయంలో బోయపాటిని అభినందించాలి. చెత్త కథలు, సుత్తి కథలు తీసి పైత్యం చూపించకుండా ఏదో ఓ మంచి పాత్రను రాసుకుని, ఆ పాత్రనే నమ్ముకుని సినిమా తీసుకున్నాడు. పైగా బాలయ్య బాబు చేత ఆయన వయసుకు తగ్గట్టు.. ఆయన ఆహర్యానికి తగ్గ సినిమా తీసి హిట్ కొట్టాడు.

కాకపోతే, రోత సన్నివేశాలు లాజిక్ లేని సీన్లు చాలా ఉన్నా.. ప్రస్తుతం దరిదాపుల్లో ఏ కొత్త సినిమా లేకపోడం అఖండకు బాగా కలిసి వచ్చింది. అఘోరాగా బాలయ్యకి మేకప్ బాగా సూట్ అయింది. ముఖ్యంగా హైందవం – దేవాలయం – సన్యాసం – శివుని తత్వం వెరసి చిన్న ఆధ్యాత్మికత భావన కల్పించే ప్రయత్నం చేశారు.

Also Read: 100 కోట్లు మార్క్ దిశగా పరుగులు తీస్తున్న బాలయ్య “అఖండ”…

కథకు తగ్గ హీరోయిన్లు పాటలు మరి కావాలి కాబట్టి, కాస్త పరిధి దాటారు. దీనివల్ల మాస్ ఆడియన్స్ కూడా సినిమాని ఇష్టపడ్డారు. అయితే, సినిమాలో అందరికీ బాగా కనెక్ట్ అయింది మాత్రం, సాధువు ధర్మం, అఘోరాల కర్తవ్యమే. కళ్ళు మూసి తపస్సు చేయడం కాదు – దేవాలయాలు – దేవుడు జోలికి వస్తే తొక్క తీస్తాం అనేలా ఉంది బాలయ్య నటన.

ఎందుకో ఆ ధార్మిక సంభాషణకి కళ్ళు చెమ్మగిల్లాయి. కాకపోతే, చాలా సినిమాలలో చూపినట్లే జపమాలను మాత్రం జపించడం తప్పుగానే చూపించారు. ఇక లెజెండ్ – సింహా లాగానే ఒకే తరహా డైలాగులు ఉన్నా రైటర్ ని మెచ్చుకోవాల్సిందే.

Also Read: ‘అఖండ’కు అసలు పరీక్ష.. ఐదో రోజు కలెక్షన్ ఎంతంటే?

Tags