ETV Prabhakar Son Chandra: సీరియల్స్ లో నటుడిగా మంచి గుర్తింపు రాగానే ప్రభాకర్, తనకు తానే బుల్లితెర మెగాస్టార్ అంటూ ఒక బిరుదు ఇచ్చేసుకుని పబ్లిసిటీ చేసుకున్న వైనం గురించి తెలిసిందే. ఇప్పుడు ప్రభాకర్ తన తనయుడ్ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అయితే, ఈ ప్రెస్ మీటే కుర్రాడి పై నెగిటివ్ టాక్ కారణం అయింది.

ఈ ప్రెస్ మీట్ లో చంద్రహాసన్ ను ప్రభాకర్ టీమ్ మీడియాకు పరిచయం చేస్తున్న సమయంలో.. చంద్రహాసన్ నడుచుకున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా చంద్ర హాసన్ చేసిన హావభావాలు.. అంటే పైకి చూస్తూ, గాల్లోకి చూస్తూ మధ్యమధ్యలో కాళ్ళు చేతులు ఊపుతూ కనిపించాడు. తానూ ఏదో పై నుంచి లాంచ్ అయిన వ్యక్తిలా బిల్డప్ ఇచ్చాడు. ఇతగాడి రియాక్షన్స్ చూసిన ట్రోలర్లు ఒక్కసారిగా సోషల్ మీడియాలో చంద్రహాసన్ ను టార్గెట్ చేశారు.
వీడి సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు, అప్పుడే స్టార్ లాగా ఫీల్ అయిపోతున్నాడు ఏమిటి ?, అసలు ఆ గంతులు వేయడం ఏమిటి ?, దీనికితోడు గాల్లోకి చూడటం ఏమిటి ?.. ఇలా రకరకాలుగా కామెంట్ చేస్తూ చంద్రహాసన్ ని టార్గెట్ చేశారు ట్రోలర్లు. అయితే, ట్రోల్ చేయించుకునేందుకే కొంతమంది హీరో హీరోయిన్లు సోషల్ మీడియా పేజీలకు డబ్బులు ఇస్తున్నారు.

కానీ ఈ కుర్రాడు రూపాయి ఖర్చు పెట్టకుండానే బీభత్సంగా ట్రోల్ అయ్యాడు. పైగా ఫుల్ పబ్లిసిటీ దక్కింది. మొత్తానికి చంద్రహాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. ఇంతకీ ఈ కుర్రాడి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి .
ఏది ఏమైనా చంద్రహాస్ బీభత్సంగా ట్రోల్ అయ్యాడు. పబ్లిసిటీకి పెద్దగా ఖర్చు పెట్టకుండానే చంద్రహాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. సాధారణంగా హీరో హీరోయిన్ల పిల్లలు ఇలా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఇలా క్రేజ్ ఉంటుంది. కానీ విచిత్రంగా ఒక సీరియల్ నటుడు కొడుక్కి కూడా ఈ స్థాయిలో పబ్లిసిటీ రావడం విశేషమే.
Also Read: NTR- Babu Gogineni: జూ.ఎన్టీఆర్ పై రగిలిపోతున్న తెలుగు తమ్ముళ్లు.. తారక్‌పై ‘బాబు’గారి దండయాత్ర