Esther Anil : ఎస్తేర్ అనిల్ అంటే టక్కున గుర్తుకు రాకపోవచ్చు. కానీ దృశ్యం మూవీలో వెంకటేష్ చిన్న కూతురు అంటే వెంటనే… ఆ అమ్మాయా? అంటారు. దృశ్యం సిరీస్ సూపర్ హిట్ కాగా… ఎస్తేరు పాపులారిటీ రాబట్టింది. మలయాళం, తెలుగు వెర్షన్స్ లో ఎస్తేర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఒరిజినల్ మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించారు. తెలుగు వెర్షన్ లో వెంకటేష్ నటించారు. రెండు భాషల్లో మీనా హీరోయిన్ గా నటించింది. అలాగే ఎస్తేర్ కూడా రెండు వెర్షన్స్ లో నటించడం విశేషం. ఇదే చిత్రాన్ని తమిళంలో పాపనాశనం పేరుతో కమల్ హాసన్ రీమేక్ చేశాడు. ఆ చిత్రంలో ఎస్తేర్ నటించారు.
దృశ్యం, దృశ్యం 2 చిత్రాల్లో ఎస్తేరు నటనకు ప్రశంసలు దక్కాయి. అప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ఎస్తేర్ ప్రస్తుతం లీడ్ రోల్స్ తో పాటు కీలక పాత్రల్లో నటిస్తుంది. ఎస్తేర్ ప్రస్తుత వయసు 22 సంవత్సరాలు. చూడటానికి మాత్రం ఇంకా చిన్న పిల్లమాదిరే ఉంటుంది. అయితే అమ్మడుకు సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్ వేరు, సోషల్ మీడియా ఇమేజ్ వేరు.
తరచుగా హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతూ ఉంటుంది. ఎస్తేర్ అనిల్ ని ఇంస్టాగ్రామ్ లో 1.3 మిలియన్ ఫాలో అవుతున్నారు. ఎస్తేర్ గ్లామరస్ ఫోటో షూట్స్ కొరకు ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా బికినీ వేసి మరింత హీటు పుట్టించింది ఎస్తేర్. సమ్మర్ కావడంతో అమ్మడు చల్లని దీవుల దేశానికి చెక్కేసింది. మాల్దీవ్స్ వెళ్లిన ఎస్తేర్ సాగర తీరంలో సేద తీరింది. ఎస్తేర్ బికినీలో జలకాలాడుతున్న వీడియో వైరల్ గా మారింది.
ఫ్యాన్స్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. బికినీలో హాట్ గా ఉన్నావని పొగిడేస్తున్నారు. ఇక ఎస్తేర్ కెరీర్ పరిశీలిస్తే… కేరళ వైనాడ్ లో పుట్టిన ఎస్తేర్ 2010లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నాల్లవన్ ఆమె మొదటి చిత్రం. దృశ్యం చిత్రంలోని నటనకు సంతోషం బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు అందుకుంది. దృశ్యం తమిళ్ వెర్షన్ పాపనాశనం చిత్రంలో నటనకు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకుంది.