https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: ఫినాలే రేస్ నుంచి ప్రశాంత్ ఔట్ .. మొదటి ఫైనలిస్ట్ గా ఊహించని కంటెస్టెంట్!

ప్రశాంత్,అమర్ ఇద్దరినీ లాక్కుంటూ వెళ్లిపోయాడు. అందరికంటే ఎక్కువ జండాలు బాస్కెట్ లో వేసి ఈ రౌండ్ లో గెలిచాడు. దీంతో స్కోర్ బోర్డు లో మొదటి ప్లేస్ లో నిలిచాడు.

Written By: , Updated On : December 2, 2023 / 10:01 AM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫినాలే అస్త్ర రేస్ లో కొనసాగుతున్న అర్జున్,అమర్ దీప్, ప్రశాంత్ లకు ఒక ఫిజికల్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ‘ పట్టు వదలకు రా డింభకా ‘ ఈ టాస్క్ లో భాగంగా ముగ్గురి నడుముకి ఒకే తాడు ఉంది. ఇక వీరి చుట్టూ జండాలు ఏర్పాటు చేశారు. బజర్ మోగగానే వారు బలం ఉపయోగించి ఆ జండాల దగ్గరకు వెళ్లి వాటిని తీసుకుని వారి బాస్కెట్ లో వేయాలి. ఇక బజర్ మోగగానే అర్జున్ విజృంభించాడు.

ప్రశాంత్,అమర్ ఇద్దరినీ లాక్కుంటూ వెళ్లిపోయాడు. అందరికంటే ఎక్కువ జండాలు బాస్కెట్ లో వేసి ఈ రౌండ్ లో గెలిచాడు. దీంతో స్కోర్ బోర్డు లో మొదటి ప్లేస్ లో నిలిచాడు. ప్రశాంత్ మూడో స్థానానికి పరిమితమై .. రేస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఫినాలే అస్త్ర సాధించేందుకు కీలకమైన ఆఖరి ఛాలెంజ్ విసిరారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో భాగంగా ఎదురుగా ఉన్న పాము నోట్లో తాడు సాయంతో మూడు బాల్స్ వేయాలి.

ఇలా రెండు తాడులు చేతులతో బ్యాలెన్స్ చేస్తూ పాము నోట్లో బాల్స్ వేయాలి. ఈ టాస్క్ లో కూడా అర్జున్ చక చకా బాల్స్ వేసేసి విజయం సాధించాడు. దాంతో అమర్ ఆశలు గల్లంతు అయ్యాయి. మొత్తానికి అర్జున్ బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలిస్ట్ గా అర్జున్ నిలిచాడు. పాపం అమర్ మొదటి నుంచి స్కోర్ బోర్డు లో టాప్ లో ఉన్నప్పటికీ విజయం సాధించలేక పోయాడు. అందరి దగ్గర పాయింట్లు తీసుకుని టాప్ లో కొనసాగినప్పటికీ చివరికి నిరాశే మిగిలింది.

ఎటువంటి ఫేవర్ లేకుండా మొదటి నుంచి టాస్క్ లు అన్నీ ఆడుతూ వచ్చి అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి సత్తా చాటాడు. కానీ ఈ వారం అర్జున్ నామినేషన్స్ లో ఉన్నాడు. కాబట్టి ఈ వారం కనుక సేవ్ అయితే మాత్రం ఇక అర్జున్ టాప్ 5 లో చేరిపోయినట్లే. మరి ఈ వారం సేవ్ అవుతాడో లేదో చూడాలి మరి. ఏమైనా జరగొచ్చు.