Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగుతుంది. ఎలిమినేషన్ ప్రక్రియ మొదట్లో సరదాగా సాగింది. తర్వాత హౌస్ మేట్స్ మధ్య వాడివేడిగా వాదనలు చోటుచేసుకున్నాయి. ముందుగా తేజ నా నామినేషన్ అర్జున్ అంటూ మొదలు పెట్టాడు. నువ్వు వచ్చిన మూడు వారాల నుంచి నామినేషన్స్ లో లేవు. ఈ రీజన్ తప్ప ఇంకోటి లేదు అని చెప్పాడు తేజ. సేఫ్ గేమ్ ఆడుతున్నావ్ అని అర్జున్ అంటే .. ఇది ఏ ఊర్లో సేఫ్ గేమ్ అయ్యా అని తేజ అన్నాడు. ఇదంతా వినోదాత్మకంగా సాగింది.
ఆ తర్వాత శివాజీ,తేజ ని నామినేట్ చేస్తూ సందీప్ ఎలిమినేషన్ గురించి ప్రస్తావించాడు. నువ్వు ఆ రోజు వాడిని నామినేట్ చేయకపోతే ఈ రోజు ఇక్కడ వుండే వాడేమో అని అన్నాడు శివాజీ. దానికి తేజ కూడా చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. తర్వాత రతిక,శోభా ని నామినేట్ చేసింది. శోభా నువ్వు ఫౌల్ గేమ్ ఆడుతున్నావ్ అని చెప్పింది. ఇక శోభా ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది. అమర్ ఒక సారి లేవవా అంటూ రతిక నీకు హెల్ప్ చేయలేదా అని అడిగింది. దానికి సీరియల్ బ్యాచ్ సభ్యుడు అమర్ అమాయకంగా హెల్ప్ చేసింది కానీ నేను తీసుకోలేదు అని చెప్పాడు.
తర్వాత తేజ తన రెండో నామినేషన్ గా రతిక పేరు చెప్పాడు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక భోలే,అమర్ దీప్ ని నామినేట్ చేశాడు. గత వారం అమర్ కుర్చీ ని తన్నిన విషయం పై భోలే వాదించాడు. నేను ఎవరి దగ్గర తప్పొప్పుకున్న చెప్పు అంటూ రెచ్చిపోయాడు. దానికి భోలే ఏదో చెప్తుంటే నువ్వు మాట్లాడకయ్యా స్వామీ .. నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు అంటూ ఎప్పట్లానే అతి చేశాడు అమర్ దీప్.
తర్వాత రతిక మీరు గ్రూప్ గా ఆడుతున్నారు అంటూ ప్రియాంకను నామినేట్ చేసింది.శివాజీ… అమర్ ని నామినేట్ చేశాడు . నువ్వు బూతులు మాట్లాడుతున్నావు ,డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నావ్ అని శివాజీ అమర్ తో అన్నాడు. కాగా ఎప్పుడు లేని విధంగా ప్రియాంక ఇంకా అమర్ దీప్ గొడవ పడ్డారు. నీకు కోపమొస్తే ఏమైనా మాట్లాడతావా అని ప్రియాంక అమర్ పై అరిచింది. నేను అంతే ఏదైనా మాట్లాడతా .. అవి నా దృష్టి లో బూతులు కాదు.. అంటూ అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పాడు అమర్ దీప్.
పల్లవి ప్రశాంత్… అమర్ దీప్, తేజలను నామినేట్ చేశాడు. ఇక ప్రియాంక… రతిక, భోలేలను నామినేట్ చేశారు. అర్జున్… శోభా శెట్టి, అమర్ లను నామినేట్ చేశాడు. ఇక శివాజీ… అమర్ దీప్, తేజాలను చేశారు. రతిక… ప్రియాంక, శోభా శెట్టిలను నామినేట్ చేసింది. తేజ… అర్జున్, రతికలను నామినేట్ చేశాడు. భోలే… ప్రియాంక, అమర్ లను నామినేట్ చేశాడు. నామినేషన్స్ ప్రక్రియ ఇంకా ముగియలేదు. ఎవరు నామినేషన్స్ లో ఉన్నారనేది నేడు తెలుస్తుంది.