పాపం ఎంతో కాలంగా స్టార్ డమ్ కోసం యుద్ధం చేస్తోన్నా ఈషాకి ఎన్నడూ కాలం కలిసిరాలేదు. అదృష్టం కలిసి వచ్చి తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసినా, వాటిల్లో ఏ సినిమా పెద్దగా కెరీర్ కి ఉపయోగపడలేదు. మొత్తానికి నటిగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తి అవుతున్నా.. ఇంతవరకు కెరీర్ ను సరిగ్గా బిల్డ్ చేసుకోలేకపోయింది. కారణం తానూ తెలుగు అమ్మాయిని అని చులకన అంటూ ఈషా ఫీల్ అవుతుంది గానీ,
అది కారణం అనుకోలేం. ఒకవేళ అదే నిజమైతే.. అమ్మడికి తమిళంలో అవకాశాలు రావాలిగా ? అక్కడ కూడా ఎప్పటి నుండో ఛాన్స్ లు కోసం ఆడిషన్స్ కూడా ఇస్తోందిగా.. ఏ అక్కడెందుకు ఇంతవరకు చెప్పుకోతగ్గ ఒక్క అవకాశం కూడా తెచ్చుకోలేకపోయింది. కారణం ఏదైనా కావొచ్చు.. ఈషాలో మ్యాటర్ ఉంటే ఏ భాషలోనైనా ఛాన్స్ లు వస్తాయి.
అలా అని ఈషాని మంచి నటి కాదు అని చెప్పలేం. కచ్చితంగా ఆమె నేటి జనరేషన్ లో మంచి నటినే. కానీ సినిమాల్లో టాలెంట్ ఒక్కటే సరిపోదు కదా. ఇక ప్రస్తుతం ఈషా ఏ క్యారెక్టర్ దొరికితే అది చేయడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో కూడా ఈ తెలుగు భామ నటించబోతుంది. ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది.
విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాణంలో అలాగే అతను రాసిన స్క్రిప్ట్ తో ఈ సిరీస్ రానుంది. హై లెవల్ లైఫ్ స్టయిల్ కు అలవాటు పడిన ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి తన ఆర్థిక అవసరాల కోసం వ్యభిచార కూపంలో ఎలా ఇరుక్కుంది. ఆ తర్వాత వేశ్యగా చెప్పుకోలేని ఇబ్బందులు పడి తిరిగి ఆ వ్యభిచార ఉచ్చులో నుండి ఎలా బయట పడిందనేదే మెయిన్ కాన్సెప్ట్.