https://oktelugu.com/

Radhe Shyam: యూట్యూబ్ లో దూసుకుపోతున్న రాధే శ్యామ్ లోని ” ఈ రాతలే ” సాంగ్… ఎన్ని వ్యూస్ అంటే ?

Radhe Shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన మూవీ  ‘రాధేశ్యామ్’. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్,  టీ సిరీస్ పతాకం పై భూషణ్ కుమార్, వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రసీద ఉప్పలపాటి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా జస్టిన్ ప్రభాకరన్ ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 23, 2021 / 03:07 PM IST
    Follow us on

    Radhe Shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన మూవీ  ‘రాధేశ్యామ్’. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్,  టీ సిరీస్ పతాకం పై భూషణ్ కుమార్, వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, ప్రసీద ఉప్పలపాటి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది.

    కాగా ఇటీవల ఈ సినిమా లోని “ఈ రాతలే” అనే లిరికల్ సాంగ్​​ వీడియోను నవంబరు 15 వ తేదీన విడుదల చేశారు. ఈ  పాట అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ సాంగ్ లోని లిరిక్స్, వీడియో థీమ్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ పాటకి యూట్యూబ్ లో 10 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.  పాట రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది.  ఇప్పుడు ఈ పాటకు కోటికి పైగా వ్యూస్ రావడంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది.  ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ తో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్‌ ” లో కూడా నటిస్తున్నాడు. అలానే ఓం రావత్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్‌’ ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే  నాగ్‌ అశ్విన్‌ ” ప్రాజెక్టు కె “, సందీప్ రెడ్డి వంగా ” స్పిరిట్ ” చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు.