Dulquer Salmaan And Prithviraj: అకస్మాత్తుగా మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులపై ఈడీ(ED) ఆదిలాకారులు సోదాలు నిర్వహించడం మొదలు పెట్టారు. ముందుగా మలయాళం సూపర్ స్టార్ మమ్మూటీకి సంబంధించి చెన్నై లో ఒక ఆఫీస్ ఉంది. అక్కడ ఈడీ అధికారులు బుధవారం రోజున సోదాలు నిర్వహిస్తున్నారు. అంతే కాదు మమ్మూటీ(Mammootty) తో పాటు అతని తనయుడు దుల్కర్ సల్మాన్ పై కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. రీసెంట్ గానే ఈయన నిర్మాతగా ‘లోక’ అనే చిత్రం తో భారీ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు. అతి తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ విషయం స్వయంగా దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నిర్మాణ సంస్థ ప్రకటించడం తో టాక్సులు సరిగా కట్టారా లేదా అని సోదాలు చేయడానికి వచ్చినట్టు చెప్తున్నారు.
అంతే కాదు దుల్కర్ సల్మాన్ , పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) వంటి హీరోలపై లగ్జరీ కార్లను స్మగ్లింగ్ చేస్తున్నారు అంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ సమాచారం ఈడీ అధికారులకు అందడంతో ఆ కోణంలో కూడా సోదారు నిర్వహించారు. ఇలా ‘ఆపరేషన్ సుకుమార్’ ప్రేతో దేశం లోని ప్రముఖుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు ఈడీ అధికారులు. మొత్తం 17 ప్రాంతాల్లో ఏకకాలం లో సోదాలు జరుగుతున్నాయి. సోదాలు నిర్వహించిన తర్వాత విచారణలో ఏమి తెలిసాయి అనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. త్వరలోనే ఈడీ అధికారులు మన టాలీవుడ్ లో కూడా సోదాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం లో దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్, గీత ఆర్ట్స్ వంటి సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహించారు. అవినీతి చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడం తో ఐటీ అధికారులు వీళ్లకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా ఎవరిని టార్గెట్ చేయబోతున్నారో చూడాలి.