Homeఎంటర్టైన్మెంట్Eagle Twitter Talk: ఈగల్ ట్విట్టర్ టాక్: రవితేజ ఇలా చేశాడేంటి భయ్యా... ఆడియన్స్ రెస్పాన్స్...

Eagle Twitter Talk: ఈగల్ ట్విట్టర్ టాక్: రవితేజ ఇలా చేశాడేంటి భయ్యా… ఆడియన్స్ రెస్పాన్స్ ఇదే!

Eagle Twitter Talk: రవితేజ యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేసిన చిత్రం ఈగల్. వరల్డ్ వైడ్ ఫిబ్రవరి 9న విడుదల చేశారు. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో సినిమా ఎలా ఉందో ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. మరి రవితేజ ఈసారైనా హిట్ కొట్టాడో లేదో చూద్దాం. ఈగల్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ… రవితేజ ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ మూవీ లవర్స్ ఇష్టపడే అంశాలతో ఈగల్ తెరకెక్కిందని ఆడియన్స్ అభిప్రాయం.

మొదటి సగం బిలో యావరేజ్ అట. వాయిస్ ఓవర్ తో పాటు, వివిధ పాత్రలతో హీరో క్యారెక్టర్ గురించి చెప్పిస్తూ కథ నడిపించారట. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కెజిఎఫ్ తరహాలో కథ చెప్పే ప్రయత్నం చేశాడట. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా సాగిందని అంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ సినిమా పుంజుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయట. ఉన్నత నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయట.

కథనంలో పట్టులేకపోయినా యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్ కలిగిస్తాయట. ఇక మాస్ మహరాజ్ రవితేజ భిన్నమైన షేడ్స్ కలిగిన రోల్ లో మెప్పించాడు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ మరో హైలెట్ అంటున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా అనుపమ పరమేశ్వరన్ పాత్ర ఆసక్తి కలిగిస్తుంది. నవదీప్ సైతం కీలక రోల్ దక్కించుకున్నాడట. మ్యూజిక్ విషయానికి వస్తే బీజీఎమ్ పర్లేదు. సాంగ్స్ మాత్రం ఏమంత ఆకట్టుకోవట.

ఫస్ట్ హాఫ్ నిరాశపరిచిన సెకండ్ హాఫ్ మెప్పిస్తుంది. దర్శకుడిపై కెజిఎఫ్, విక్రమ్ చిత్రాల ప్రభావం గట్టిగా ఉంది. ఆ చిత్రాల షేడ్స్ ఈగల్ లో కనిపిస్తాయట. మొత్తంగా ఈగల్ చూడదగ్గ చిత్రం అంటున్నారు. రవితేజ ఫ్యాన్స్ సినిమా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సాధారణ ఆడియన్స్ కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రం. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రధాన బలం. ఈ క్రమంలో రవితేజ హిట్ కొట్టినట్లే అంటున్నారు. పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా ఫలితం ఏమిటో తెలియదు..

RELATED ARTICLES

Most Popular