https://oktelugu.com/

విజయ్ దేవరకొండకు నిర్మాణ సంస్థ సారీ

టాలీవుడ్ లవర్ బాయ్.. సంచలన హీరో విజయ్ దేవరకొండ అంటే తమకు క్రష్ అని.. అతడితో ఒక్క సినిమా కూడా తీయాలని వర్ధమాన సీనియర్ హీరోయిన్లు అందరూ వివిధ ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. అలాంటిది హీరో విజయ్ డేట్స్ మా వద్ద ఉన్నాయని.. మీరు నటిస్తారా అని చాలా మంది హీరోయిన్లకు ఓ నిర్మాణ సంస్థ పేరుతో కొందరు టోకరా కొట్టారట.. ఈ విషయం తెలిసి విజయ్ టీం అలెర్ట్ కావడంతో తాజాగా నిర్మాణ సంస్థ విజయ్ దేవరకొండకు సారీ చెప్పింది. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : September 17, 2020 / 04:58 PM IST
    Follow us on

    టాలీవుడ్ లవర్ బాయ్.. సంచలన హీరో విజయ్ దేవరకొండ అంటే తమకు క్రష్ అని.. అతడితో ఒక్క సినిమా కూడా తీయాలని వర్ధమాన సీనియర్ హీరోయిన్లు అందరూ వివిధ ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు. అలాంటిది హీరో విజయ్ డేట్స్ మా వద్ద ఉన్నాయని.. మీరు నటిస్తారా అని చాలా మంది హీరోయిన్లకు ఓ నిర్మాణ సంస్థ పేరుతో కొందరు టోకరా కొట్టారట.. ఈ విషయం తెలిసి విజయ్ టీం అలెర్ట్ కావడంతో తాజాగా నిర్మాణ సంస్థ విజయ్ దేవరకొండకు సారీ చెప్పింది.

    Also Read: దీపావళికి పేలనున్న ‘లక్ష్మీబాంబ్’

    విజయ్ దేవరకొండ కు ఓ నిర్మాణ సంస్థ బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామని పలువురు హీరోయిన్లను అప్రోచ్ అయి వేధించిన తమిళ నిర్మాణ సంస్థ డస్కీ ఎంటర్ టైన్మెంట్స్ తన తప్పును తెలుసుకుంది.హీరో విజయ్ దేవరకొండ కు క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది.తమ ప్రమేయం లేకుండా ఓ ఏజెన్సీ ఇలా చేసిందనీ,వాళ్లమీద వెంటనే చర్యలు తీసుకుంటామని, భవిష్యత్ లో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని పేర్కొంది.

    విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నామని పలువురు హీరోయిన్లను అప్రోచ్ అయింది డస్కీ ఎంటర్ టైన్మెంట్స్. విజయ్ కు మాకు సైన్ చేశాడనీ,మీరు కూడా ఒప్పుకోవాలని కాల్స్ చేసి వేధించారు.కొందరు హీరోయిన్లు నిజమా కాదా అని చెక్ చేసుకునేందుకు విజయ్ టీమ్ ను అప్రోచ్ అయ్యారు.

    ఇంతకుముందు కూడా కొందరు విజయ్ పేరు చెప్పి ఆడిషన్స్ నిర్వహించడం వల్ల టీమ్ విజయ్ దేవరకొండ హెడ్ అనురాగ్ పర్వతనేని వెంటనే అలెర్ట్ అయ్యారు. కోలీవుడ్,టాలీవుడ్ లో ఉన్న కాస్టింగ్ మేనేజర్లందరికీ ఫోన్లు చేసి అది ఫేక్ అని చెప్పారు..తాము ఎలాంటి సంస్థకు సైన్ చేయలేదనీ,ఇలాంటివి నమ్మి మోసపోవద్దని మీడియాకు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

    Also Read: డ్రగ్స్ కేసులో కథనాలపై ఢిల్లీ హైకోర్టుకు రకూల్

    అంతే కాకుండా డస్కీ ఎంటర్ టైన్మెంట్స్ వాళ్లను కాంటాక్ట్ అయి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.వెంటనే తమ తప్పును తెలుసుకున్న ఆ నిర్మాణ సంస్థ క్షమాపణలు చెప్పి దీనికి కారణమైన పలువురి ఉద్యోగుల మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. విజయ్ దేవరకొండకు బహిరంగంగా క్షమాపణలు చెబుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

    నిజానికి స్టార్ హీరోలకు ఇలాంటివి మామూలే..కానీ హీరో ల పేరు చెప్పగానే కొందరు నటీనటులు నమ్మి ఫేక్ నిర్మాణ సంస్థల చేతిలో మోసపోతుంటారు.అందుకే ఈ ఇష్యూని లైట్ గా తీసుకోకుండా విజయ్ టీమ్ చాకచక్యంగా సాల్వ్ చేసింది.ఈ విషయంలో వాళ్లను అభినందిచాల్సిందే