Kaantha Collection: దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సినిమాల్లో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. ఆయన కథల ఎంపికలో ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. అందుకే డిఫరెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక మలయాళం సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ని స్టార్ట్ చేసిన ఆయన ప్రస్తుతం ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన తొందర్లోనే పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో చేసిన ‘కాంత’ సినిమా రీసెంట్ గా రిలీజైంది. ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ 85 కోట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా 100 కోట్లకు పైన కలెక్షన్ ను రాబడితేనే బ్రేక్ ఈవెన్ గా మారుతోందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది…
మొదటి రోజు ఈ సినిమాకి అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా చక్కటి ఆదరణ దక్కింది. తెలుగులో ఈ సినిమాని రానా ఓన్ గా రిలీజ్ చేసుకున్నాడు. ఈ సినిమాకి తెలుగులో మొదటిరోజు 3 కోట్ల రూపాయల వసూళ్లైతే వచ్చాయి. మలయాళం లో 4 కోట, తమిళం లో 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ దక్కాయి…
కర్ణాటక + హిందీలో కలిపి కోటి రూపాయల వసూలైతే వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకి రెండు కోట్ల వసూళ్లు వచ్చాయి. మొత్తానికైతే ఈ సినిమా పన్నెండు కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. మొదటి రోజే ఇంత తక్కువ కలెక్షన్స్ రాబడితే మరి మిగతా రోజుల్లో ఈ సినిమా ఎలాంటి వసూళ్లను కలెక్ట్ చేస్తోంది. తద్వారా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ గా మారుతుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది…
ఈ వీకెండ్ గడిస్తే గాని ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది చెప్పడం కష్టం… ఇక దుల్కర్ సల్మాన్ సినిమాలంటే మినిమం గ్యారంటీ సినిమాలుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలకు భారీ బడ్జెట్లు ఉండవు. మినిమం బడ్జెట్లను పెడుతూ సినిమాలు చేస్తూ సక్సెస్ ని సాధిస్తూ ఉంటారు…ఈ సినిమా ఏ కోవా కి చెందుతుందో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…