Dude Collection Day 6: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డ్యూడ్'(Dude Movie) కమర్షియల్ గా తమిళ వెర్షన్ లో సూపర్ హిట్ వైపు దూసుకెళ్తుంది. కానీ టాక్ మాత్రం డివైడ్ గానే వచ్చింది. కొంతమంది యూత్ ఆడియన్స్ కి నచ్చింది,కొంతమందికి నచ్చలేదు. ఫలితంగా ఈ సినిమా అనుకున్న రేంజ్ కి చేరుకోలేకపోవచ్చు కానీ, తమిళ వెర్షన్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకోవచ్చు. నిర్మాతలు ఈ చిత్రం ఆరు రోజుల్లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చెప్తున్నారు కానీ, ట్రేడ్ లెక్కల్లో మాత్రం ఇంకా ఆ మార్కుని అందుకోలేదు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలకు కలుపుకొని ఆరు రోజులకు 85 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ తో 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోనుంది ఈ చిత్రం.
అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ లో మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం దాదాపుగా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే రోజురోజుకి కలెక్షన్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు 5 వ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 84 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, ఆరవ రోజున కేవలం 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. అంటే ముందు రోజుతో పోలిస్తే 50 శాతం వసూళ్లు తగ్గిపోయాయి అన్నమాట. ఒక సినిమా లాంగ్ రన్ కి ఇది ఏ మాత్రం శుభ సూచికం కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 11 కోట్ల రూపాయలకు జరిగింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా మూడు కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. ఈ వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ ని రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిన్నటి లాగా భారీ డ్రాప్స్ ఉంటే మాత్రం బ్రేక్ ఈవెన్ అందుకోవడం కష్టమే. ఇక ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే తమిళనాడు నుండి 43 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల నుండి 14 కోట్ల 25 లక్షలు, కర్ణాటక రాష్ట్రము నుండి 4 కోట్ల 5 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్లు, ఓవర్సీస్ నుండి 20 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రం 6 రోజుల్లో 85 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 42 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాబట్టి 70 శాతం రికవరీ ని సొంతం చేసుకుంది. అంటే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 18 కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది.