దేవి ‘పుష్ప’తో అదరగొట్టేస్తాడట !

మహేష్ బాబు కామెడీ జానర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు, అయితే ఆ సినిమా హిట్ అయినా.. దేవికి మాత్రం మ్యూజిక్ పరంగా పెద్దగా నేమ్ అయితే రాలేదు. గతంలో మహేష్ నటించిన ‘శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను’ చిత్రాలకు బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’కు మాత్రం ఆ స్థాయిలో ట్యూన్స్ ఇవ్వలేకపోయాడనే వార్త ఫిల్మ్ వర్గాల్లో దేవి […]

Written By: admin, Updated On : June 9, 2020 4:49 pm
Follow us on


మహేష్ బాబు కామెడీ జానర్ మీద ఎక్కువ దృష్టి పెట్టి చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు, అయితే ఆ సినిమా హిట్ అయినా.. దేవికి మాత్రం మ్యూజిక్ పరంగా పెద్దగా నేమ్ అయితే రాలేదు. గతంలో మహేష్ నటించిన ‘శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను’ చిత్రాలకు బ్రహ్మాండమైన సంగీతం అందించిన దేవి శ్రీ ‘సరిలేరు నీకెవ్వరు’కు మాత్రం ఆ స్థాయిలో ట్యూన్స్ ఇవ్వలేకపోయాడనే వార్త ఫిల్మ్ వర్గాల్లో దేవి ఇమేజ్ ని డామేజ్ చేసింది. మరో పక్క తమన్ రెచ్చిపోతుంటే.. దేవి మాత్రం రొటీన్ మ్యూజిక్ తో ఇబ్బంది పెడుతున్నాడని కామెంట్స్ వినిపించడంతో ‘దేవి శ్రీ’లో కసి పెరిగిందట.

ప్రస్తుతం దేవి బన్నీ ‘పుష్ప’ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకి దేవి శ్రీ కసితో పనిచేస్తున్నాడని ఈ సారి సంగీతం అదరగొట్టేశాడని, సాంగ్స్ అన్నీ పూర్తి సంతృప్తిగా ఉండనున్నాయని తెలుస్తోంది. పైగా ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటం కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ కానుంది. ఇక ఈ క్ర‌మంలో ఓ సాంగ్ ను రెడీ చేసి డైరెక్టర్ సుకుమార్ కి అండ్ బ‌న్నికి వినిపించ‌డం, వాళ్ళ‌కు సాంగ్ బాగా న‌చ్చ‌డం, హ్యాపీగా ఫీల‌వ‌డం కూడా జ‌రిగింద‌ట‌.

ప్రస్తుతం దేవి ఐటం సాంగ్‌ను కంపో చేసే పనిలో ఉన్నాడ‌ట. మ‌రి సుకుమార్ – దేవీ కాంబినేష‌న్‌లో ఐటం సాంగ్స్ అంటే ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. మొత్తానికి పుష్ప సినిమా కోసం దేవి ప్రిపేర్ చేసే ఐటమ్ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల‌ను ఓ రేంజ్‌ లో ఊపేస్తుందనడంలో సందేహం లేదు.