ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. సుశాంత్ సోదరుడు షోవిక్, డ్రగ్ డీలర్ బాసిత్, శశాంక్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. అదేవిధంగా హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. వీరంతా కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా గురువారం నాటికి విచారణను వేయిదాపడింది.
దర్యాప్తులో భాగంగా ఎన్సీబీ పోలీసులకు కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది. 25మంది సెలబ్రెటీలకు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరిలో టాలీవుడ్ కు చెందిన పలువురి పేర్లు ఉన్నట్లు మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నారు. టాలీవుడ్లో అగ్రనటిగా కొనసాగుతున్న రకుల్ ప్రీతిసింగ్ పేరు మీడియాలో రావడంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆందోళన నెలకొంది.
తాజాగా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తోపాటు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కు ఎన్సీబీ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా టాలీవుడ్ నిర్మాత మధుకు కూడా పోలీసులు నోటీసులు పంపించగా నేడు ఆయన విచారణకు హాజరుకానున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో విన్పిస్తోంది.
నిర్మాత మధు ఇటీవలే అనురాగ్ కశ్యప్, వికాల్ బాల్, విక్రమాదిత్యతో కలిసి ఫాంటమ్ ఫిలింస్ ను ప్రారంభించారు. బాలీవుడ్లో పలు హిట్టు సినిమాలను నిర్మించిన మధు తెలుగులో ‘రక్తచరిత్ర’ నిర్మించాడు. ఆయన ప్రస్తుతం సెలబ్రెటీ మేనేజ్మెంట్ కంపెనీ క్వాన్ కో ఫౌండర్ కావడం.. పలువురి హీరోయిన్ డేట్స్ హ్యాండిల్ చేస్తుండటంతో ఆయనను పోలీసులు విచారించేందుకు నోటీలిచ్చేరనే ప్రచారం జరుగుతోంది.