Homeఎంటర్టైన్మెంట్Drishyam 3 advance bookings collection: అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సెన్సేషన్ సృష్టించిన 'దృశ్యం 3'.....

Drishyam 3 advance bookings collection: అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సెన్సేషన్ సృష్టించిన ‘దృశ్యం 3’.. ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Drishyam 3 advance bookings collection: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దృశ్యం 3’ ఈ నెల 21 న విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు, ఎందుకంటే ముందు రెండు సినిమాలకు ఆడియన్స్ నుండి వచ్చిన ఆదరణ అలాంటిది. అద్భుతమైన థియేట్రికల్ అనుభూతి ని కలిగించిన థ్రిల్లర్ సిరీస్ ఇది. అయితే ‘దృశ్యం’ చిత్రం థియేటర్స్ లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది , అంతకంటే మంచి కంటెంట్ తో వచ్చిన ‘దృశ్యం 2’ మాత్రం కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదలైంది. ఒకవేళ ‘దృశ్యం 2’ థియేటర్స్ లో విడుదల అయ్యుంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది, బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ‘దృశ్యం 3’ చిత్రం మరో 3 రోజుల్లో థియేటర్స్ లో రాబోతుంది.

అయితే ee చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని ఒకసారి పరిశీలించి చూస్తే , మళయాలం మూవీస్ లో మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ సినిమాగా ‘దృశ్యం 3’ నిలుస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఎందుకంటే ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా, అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఊపు చూస్తుంటే ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 50 కోట్ల రూపాయిలు దాటేలా అనిపిస్తోంది. అదే కనుక జరిగి , పాజిటివ్ టాక్ థియేటర్స్ నుండి వస్తే మాత్రం , ఈ చిత్రానికి కచ్చితంగా మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ వసూళ్లు వస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతే కాదు ఈ చిత్రానికి మంచి లాంగ్ రన్ వస్తే 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు లాంగ్ రన్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతానికి నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి 15 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. నార్త్ అమెరికా లో మలయాళం సినిమాలకు పెద్ద క్రేజ్ ఉండదు , అక్కడే ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంటే , ఇక మలయాళం ఇండస్ట్రీ కి కంచుకోటగా పిలవబడే గల్ఫ్ దేశాల్లో ఏ రేంజ్ బుకింగ్స్ జరుగుతున్నాయో మీరే ఊహించుకోండి. ఇక ఇండియా లో ప్రస్తుతానికి బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 5 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. రేపు ఈ సంఖ్య మూడింతలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం సృష్టించే విద్వంసం ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular