NTR Dragon Movie release date: ఎన్టీఆర్(Junior NTR) అభిమానులు, టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘డ్రాగన్'(Dragon Movie). ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా కావడం తో ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించిన రోజు నుండే అంచనాలు వేరే లెవెల్ కి చేరాయి. కానీ మేకర్స్ మాత్రం ఒక్క అప్డేట్ కూడా బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. షూటింగ్ అప్డేట్స్ తెలిసేవి కానీ , ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు అనే అప్డేట్స్ మాత్రం బయటకు రానివ్వలేదు. ఇకపోతే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ని విడుదల చేస్తూ , ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అంతే కాకుండా మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని కూడా విడుదల చేయబోతున్నారు.
ఇదంతా పక్కన పెడితే, మొదట్లో ఈ చిత్రాన్ని కేవలం ఒక భాగం లోనే తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ స్టోరీ చాలా పెద్దది అవ్వడం తో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ ని ఒకేసారి చేస్తున్నారట. మొదటి భాగం జూన్ 11 న విడుదల కాబోతుంటే, రెండవ భాగాన్ని డిసెంబర్ నెలలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అంటే ఎన్టీఆర్ ఒకే ఏడాది రెండు సార్లు వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతున్నాడు అన్నమాట. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ హీరో కూడా ఒకే ఏడాది లో రెండు సార్లు వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకోలేదు. ఒకవేళ ఎన్టీఆర్ ఆ ఫీట్ ని అందుకుంటే హిస్టరీ లో నిలిచిపోతాడు.
ధురంధర్ సిరీస్ కేవలం మూడు నెలల గ్యాప్ లో విడుదలైనప్పటికీ ఒకటి 2026 డిసెంబర్ కాగా, మరొకటి 2027 మార్చ్. కాబట్టి ఒకే ఏడాది లెక్కలోకి రాదు. ఆ అరుదైన అదృష్టం ఎన్టీఆర్ కి మాత్రమే దక్కింది. ఇక మే 20 నుండి మేకర్స్ విడుదల చేయబోయే ప్రమోషనల్ కంటెంట్స్ మీద ఈ ‘డ్రాగన్’ సిరీస్ రేంజ్ డిసైడ్ అవుతుంది. ఇకపోతే ఈ సిరీస్ లో విలన్ క్యారెక్టర్ కోసం ప్రస్తుతం మేకర్స్ వెతుకుతున్నారు. ముందుగా టోనీవో థామస్ తో షూటింగ్ ఒక నెల రోజుల పాటు చేశారు. కానీ ఆ తర్వాత స్క్రిప్ట్ ని పూర్తిగా మార్చాల్సి రావడం తో , మరిన్ని డేట్స్ అదనంగా కోరడం వల్ల, తనకు సెట్ అవ్వదని టోనీవో థామస్ తప్పుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ హీరో షాహిద్ కపూర్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన కూడా ఒప్పుకోలేదని సమాచారం, మరి ఎవరు ఈ చిత్రం లో విలన్ గా నటించబోతున్నారు అనేది తెలియాలంటే మరో నెల రోజులు ఎదురు చూడాల్సిందే.