Dragon Movie Shooting: ‘దేవర’, ‘వార్ 2’ చిత్రాల తర్వాత ఎన్టీఆర్(Junior NTR) ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం లో ‘డ్రాగన్'(Dragon Movie) అనే చిత్రం షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. గత ఏడాది మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ ఏడాది రీసెంట్ గానే ఒక షెడ్యూల్ ని ఆరంభించింది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతూ ఉండడం వల్ల, ప్రస్తుతం వాతావరణం సహకరించకపోవడం తో ఎన్టీఆర్ అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. డాక్టర్లు ఎన్టీఆర్ ని కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే షూటింగ్ మొదలు అవుతుందని ప్రశాంత్ నీల్ అన్నాడట. మరోపక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని, ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తుండడం వల్లే అస్వస్థతకు గురయ్యాడని, ప్రస్తుతం భయపడాల్సిన అవసరమే లేదని, కొన్ని రొజుల విశ్రాంతి తర్వాత ఆయన యధావిధిగా షూటింగ్ లో పాల్గొంటాడని అంటున్నారు ఎన్టీఆర్ టీం. అందుకే కి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే, సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి రోజున ఎన్టీఆర్ గార్డెన్స్ కి రాలేకపోయాడు. ఆ రోజు కేవలం కళ్యాణ్ రామ్ మాత్రమే పాల్గొన్నాడు. అంతే కాకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండడం వల్ల ఆయన కొన్ని సినిమాలు ఓటీటీ లో చూస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన ‘దండోరా’ మూవీ ని చూసి ట్విట్టర్ లో ఆ చిత్రం గురించి గొప్పగా మాట్లాడాడు అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. ఇక డ్రాగన్ సినిమా విశేషాలకు వస్తే, అన్నీ అనుకున్నట్టు జరిగి ఉండుంటే, ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
కానీ ప్రశాంత్ నీల్ సంగతి తెలిసిందేగా, ఈయన రాజమౌళి కంటే పెద్ద జక్కన. తన విజన్ కి తగ్గ షాట్ డెలివరీ అయ్యేంత వరకు రీ షూటింగ్ చేస్తూనే ఉంటాడు. అలా ఇప్పటి వరకు ఆయన షూట్ చేసిన అత్యధిక సన్నివేశాలను మరోసారి రీ షూట్ చేయాల్సి వచ్చిందట. అలా చెక్కిన తర్వాత ఈ చిత్రం కేవలం 20 శాతం మాత్రమే పూర్తి అయ్యింది. మధ్యలో లాంగ్ గ్యాప్ తీసుకొని స్క్రిప్ట్ లో భారీ మార్పులు కూడా చేసాడట. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. అదే విధంగా ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ కోసం బాలీవుడ్ ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన అనిల్ కపూర్ ని ఎంచుకున్నారట.