Doctor Babu : నిరుపమ్ పరిటాల అనే పేరు కంటే డాక్టర్ బాబు అంటేనే చాలా మంది గుర్తు పడతారు. కేవలం కార్తీక దీపం సీరియల్ తోనే చాలా గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన. ఈయనకు మామూలు ఫాలోయింగ్ కాదు ఓ హీరో కంటే ఎక్కువ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. స్టార్ మాలో ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ ఏ రేంజ్ లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో సంచలన రికార్డులు సృష్టించింది ఈ సీరియల్. ఇక రేటింగ్ విషయంలో సరికొత్త ఫీట్స్ అధిగమించింది. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క స్క్రీన్ ప్రెజెన్స్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సీరియల్ మాయలో పడిపోయారు అనడంలో సందేహం లేదు. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేక్షక లోకాన్ని టీవీలకు అతుక్కుపోయేలా మాయ చేసింది ఈ సీరియల్.
ఈ సీరియల్ వల్ల డాక్టర్ బాబు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందనే చెప్పాలి. వరుస ఆఫర్స్ రావడమే గాక పలు ఛానెల్స్‌లో ప్రసారమయ్యే సీరియల్స్‌తో తీరిక లేనంత బిజీగా అయ్యారు ఈయన. బుల్లితెర శోభన్ బాబుగా అమ్మాయిల మనసు దోచేశారు. దోచేస్తున్నారు. అయితే షూటింగ్స్ లేని సమయంలో ఫ్యామిలీతో సరదా టూర్ వేస్తూ ఎంజాయ్ చేస్తారు ఈ బుల్లితెర హరో.
రీసెంట్ గా తన భార్య మంజులతో కలిసి ఓ రొమాంటిక్ టూర్ వేశారు డాక్టర్ బాబు. ఇక తన భార్యతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ పిక్స్ ఫుల్ గా వైరల్ గా అవుతున్నాయి. పోజ్ పెట్టటానికి ఇది టైటానిక్ కాకపోవచ్చు కానీ.. రిఫ్రెష్ కావడానికి ఈ ట్రిప్ ఒక టానిక్ అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అంటూ నిరూపమ్ ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో అందరితో పంచుకున్నారు. డాక్టర్ బాబు- మంజుల రొమాంటిక్ పోజులు చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు కూడా. మన డాక్టర్ బాబులో రొమాంటిక్ సెన్స్ ఎక్కువే ఉంది కదా అంటూ వారి అభిమానులు కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు.
డాక్టర్ బాబు ప్రస్తుతం కార్తీక దీపం- 2, మూగమనసులు, హిట్లర్ గారి పెళ్లాం వంటి పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. వీటితో పాటు పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తున్నారు. మొత్తం మీద సమయం దొరికినప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు డాక్టర్ బాబు. ఈయన పోటోలు చాలా సార్లు వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. అయితే భర్త ఫోటోలు మాత్రమే కాదు భార్య మంజూల కూడా తన ఫోటోలతో ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక ఈమె కూడా సీరియల్స్ లో నటించి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఒకప్పుడు మంచి మంచి సీరియల్స్, హిట్ సీరియల్స్ లో నటించింది మంజూల. ఈమెకు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.