https://oktelugu.com/

Karthika Deepam: ధైర్యం కోల్పోయిన డాక్టర్ బాబుకు పెద్ద దిక్కుగా నిలిచిన వంటలక్క..!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో కార్తీక్ తన కుటుంబాన్ని తీసుకొని రోడ్డుపై ప్రయాణిస్తాడు. హిమ, సౌర్య ఎక్కడికి వెళ్తున్నాము అంటూ ప్రశ్నిస్తారు. ఇక దీప వాళ్లకు సర్దిచెప్పి ఇదంతా సర్ప్రైజ్ అన్నట్లు చెబుతుంది. ఇక పదేపదే నాన్నను ప్రశ్నలతో విసిగించకండి అనే సరికి పిల్లలు సరే అని అంటారు. మరోవైపు మోనిత సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్లి కార్తీక్ ను పిలుస్తుంది. ఆదిత్య.. కార్తీక్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 9, 2021 / 11:00 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో కార్తీక్ తన కుటుంబాన్ని తీసుకొని రోడ్డుపై ప్రయాణిస్తాడు. హిమ, సౌర్య ఎక్కడికి వెళ్తున్నాము అంటూ ప్రశ్నిస్తారు. ఇక దీప వాళ్లకు సర్దిచెప్పి ఇదంతా సర్ప్రైజ్ అన్నట్లు చెబుతుంది. ఇక పదేపదే నాన్నను ప్రశ్నలతో విసిగించకండి అనే సరికి పిల్లలు సరే అని అంటారు. మరోవైపు మోనిత సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్లి కార్తీక్ ను పిలుస్తుంది.

    Karthika Deepam

    ఆదిత్య.. కార్తీక్ లేడని చెప్పే సరికి మోనిత షాక్ అవుతూ ఇదంతా నాటకమని.. ఏదో ప్లాన్ చేశారు అని అంటూ తన మాటలతో రెచ్చగొడుతుంది. దీంతో ఆదిత్య కు కోపం రావడం తో ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ తనపై అరుస్తాడు. ఇక సౌందర్య కూడా ఈ ఇంటితో నీకు సంబంధం లేదు అని అనేసరికి మోనిత కోపంతో రగిలిపోతూ..ఈ ఇంటికి సంబంధం లేనిది దోష నివారణ పూజ ఎలా చేయించావు అని ప్రశ్నలు వేస్తోంది.

    Also Read: స్నానం చేస్తున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగ్… రెండు నెలలు నిద్రపోలేదు

    ఆనందరావు కూడా మోనితను విసిగించవద్దని తనను వెళ్ళిపోమని అంటాడు. అందర్నీ చూసి ఇదంతా నిజమా.. నాటకమా అనుకుంటూ అక్కడి నుంచి బై చెప్పి వెళ్లిపోతుంది. ఆనందరావు బాధపడుతూ కార్తీక్ ఏం చేస్తున్నాడో అని అనుకుంటాడు. ఇక కార్తీక్ వాళ్లు ఓ ఇంటి దగ్గర బయట ఉంటారు. అక్కడ ఒకావిడ వాళ్లను చూడటంతో దీప ఆమె దగ్గరకు వెళ్లి ఇంటి దగ్గర ఉండకూడదు అని చెబుతోంది.

    ఇక దీప ధైర్యం చేసి ఎలాగైనా ఆ ఇంట్లో ఉండాలని అనుకుంటుంది. పిల్లలను తనకు సహాయం చేయమని కోరుకుంటుంది. తరువాయి భాగంలో ఒక పెద్దావిడ దగ్గరికి వెళ్లి దీప ఏదో సహాయం అడగటానికి ముందడుగు వేసినట్లు అనిపిస్తుంది. మొత్తానికి దీప తన కుటుంబం కోసం ధైర్యంతో ముందుకు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ధైర్యం కోల్పోయిన కార్తీక్ కు పెద్ద దిక్కుతో దీప ధైర్యాన్ని నింపేలా చేస్తుంది.

    Also Read: కార్తీకదీపం మోనిత కన్నీటి కష్టాలు తెలిస్తే గుండె తరుక్కుపోతుంది!