Trivikram- YCP: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్స్ లో ఒకటి భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రం..గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కబోయ్యే ఈ సినిమా ప్రాజెక్ట్ ఎప్పుడో ప్రారంభం కావాల్సింది..కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్ల ఈ సినిమా ఇప్పటి వరుకు ప్రారంభం కాలేదు..త్రివిక్రమ్ శ్రీనివాస్ OTT లో వచ్చిన మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యపనుమ్ కోశియుమ్’ అనే సినిమా చూసి పవన్ కళ్యాణ్ కి సజెస్ట్ చెయ్యడం..రీమేక్ సినిమా కదా తొందరగా అయిపోతుందని పవన్ కళ్యాణ్ వెంటనే ఆ సినిమాకి ఓకే చెప్పి ‘భవదీయుడు భగత్ సింగ్’ ని పక్కన పెట్టడం అంత చకచకా జరిగిపోయాయి..భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్..కానీ ఫామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు..ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తున్నాడు అని విమర్శల పాలయ్యేలా చేసింది ఈ చిత్రం..భీమ్లా నాయక్ సినిమా అడ్డు లేకుండా ఉంది ఉంటె ఈపాటికి హరి హర వీరమల్లు మరియు భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు షూటింగ్ ని పూర్తి చేసుకొని విడుదల కూడా అయిపోయాయి ఉండేవి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

ఇపుడు హరి హర వీరమల్లు సినిమాని పూర్తి చేసి , భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాని ప్రారంభిద్దాం అనే ఆలోచనలో ఉన్న పవన్ కళ్యాణ్ కి తమిళం లో సూపర్ హిట్ గా నిలిచినా ‘వినోదయ్యా సీతం’ రీమేక్ ని సూచించాడు త్రివిక్రమ్..ఈ సినిమాకి స్వయంగా ఆయన మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా..తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు కూడా..ఇటీవలే ఈ సినిమా కి సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా సైలెంట్ గా ప్రారంభం అయ్యాయి..దీనితో భవదీయుడు భగత్ సినిమా ప్రారంభం మరింత ఆలస్యం అయ్యింది..మరో పక్క పవన్ కళ్యాణ్ ఎప్పుడు పొలిటికల్ గా బిజీ అవుతాడో..ఎక్కడ ఈ డ్రీం ప్రాజెక్ట్ అట్టకెక్కుతాడో అని అభిమానులు భయపడుతున్నారు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ వాయిదా పడింది..ఎట్టకేలకు హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ వచ్చే నెల 16 వ తేదీ నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో తిరిగి ప్రారంభం కాబోతుంది..మధ్యలో మళ్ళీ భవదీయుడు భగత్ సింగ్ ప్రారంభం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి..కానీ మధ్యలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కడ ఆ వినోదయ్యా సీతం సినిమాని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ లైనప్ ని చెడగొడుతాడో అని అభిమానులు భయపడుతున్నారు..ఇవన్నీ చూస్తుంటే త్రివిక్రమ్ తో వైసీపీ పార్టీ నే ఇలా కావాలని చేయించి పవన్ కళ్యాణ్ కెరీర్ ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నట్టు ఉందని అభిమానులు సోషల్ మీడియా లో ఆరోపిస్తున్నారు.