https://oktelugu.com/

Sai Pallavi: ఫ్లాప్ అవుతాయని తెలిసే సాయి పల్లవి సినిమాలను రిజక్ట్ చేస్తుందా? ఇదిగో ప్రూఫ్..

సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ మంచి పాత్ర వస్తేనే నటిస్తుంది ఈ అమ్మడు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉండాల్సిందే. లేదంటే సింపుల్ గా నో చెప్పేస్తుంటుంది ఈ బ్యూటీ.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 12, 2024 / 02:20 PM IST
    Follow us on

    Sai Pallavi: నాచురల్ బ్యూటీ.. సింపుల్ గల్ ఎవరు అనగానే వెంటనే గుర్తు వచ్చే పేరు సాయి పల్లవి. మన పక్కింటి అమ్మాయిలాగా కనిపిస్తూ అందరి మనసును దోచుకుంది అమ్మడు. మొహం మీద మొటిమలే ఆమెకు అందం అంటారు. ఇక ఫిదా మూవీతో ఫిదా చేసింది ఈ బ్యూటీ. అయితే ఈమె ఇప్పటి వరకు కూడా ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంది. ఇక ఈ అమ్మడు రిజెక్ట్ చేసిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ లనే సొంతం చేసుకున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అనుకుంటున్నారా?

    సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ మంచి పాత్ర వస్తేనే నటిస్తుంది ఈ అమ్మడు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చినా కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉండాల్సిందే. లేదంటే సింపుల్ గా నో చెప్పేస్తుంటుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా ఎక్కువ సినిమాల్లో కనిపించడం లేదు. కానీ రానున్న సినిమాల్లో ఈ అమ్మడు సినిమాలు బాగానే ఉన్నాయని టాక్. ఆ మధ్య సినిమా ఫీల్డ్ ను ఒదిలి తనకు నచ్చిన డాక్టర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తుందనే టాక్ వచ్చింది. కానీ అది నిజం కాదని తొందరలోనే తెలిసింది.

    ఇటీవల చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. కానీ ఆ సినిమా ఆఫర్ ను ఈజీగా తిరస్కరించింది అమ్మడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుందో తెలిసిందే. అంతకు ముందు కామ్రేడ్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించేందుకు కూడా అవకాశం వచ్చిందట. కానీ అందులో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో నటించను అని చెప్పిందట. ఆ తర్వాత ఆ పాత్రలో రష్మిక నటించింది. ఇక ఈ సినిమా కూడా నిరాశ పరిచింది.

    ఇక తమిళంలో అజిత్ సరసన నటించేందుకు వలిమై సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఈ పాత్ర కూడా నచ్చకపోవడంతో రిజక్ట్ చేసింది అమ్మడు. ఇటీవల స్టార్ హీరో విజయ్ కు సరసన నటించడానికి లియో సినిమాలో కూడా అవకాశం వచ్చిందట. కానీ ఆ సినిమాలోని పాత్రకు పెద్దగా స్కోప్ లేదని రిజెక్ట్ చేసిందట. ఇక ఈ సినిమా వసూళ్లను రాబట్టినా.. విమర్శల పాలైంది. ఇక చంద్రముఖి -2 సినిమాలో కూడా అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా కూడా నో చెప్పింది. ఇక ఇది కూడా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అయితే ఇలా ఈమె నటించను అని చెప్పిన సినిమాలు ఇలాంటి ఫలితాలనే సొంతం చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతం సాయి పల్లవి శివకార్తికేయన్ సరసన కమలహాసన్ నిర్మిస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.