Ravi Teja: కొంతమంది హీరోలు అవుదామని ఇండస్ట్రీకి వచ్చి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉంటారు.అలాంటి వాళ్లలో రవితేజ ఒకరు ఈయన సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఇంట్లో నుంచి వచ్చేసి సినిమా అవకాశాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. సినిమా ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం అంటే అంత ఈజీ కాదు.అయితే రవితేజ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు రవితేజ… ఆ తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంటూ నటుడుగా ముందుకు సాగాడు.అందులో భాగంగానే కృష్ణ వంశీ తీసిన సింధూరం సినిమాలో రవితేజ సెకండ్ హీరోగా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పూరి జగన్నాథ్ రవితేజని స్టార్ గా చేయాలని అనుకొని ఆయనతో వరుసగా మూడు సినిమాలు చేశాడు.
అవే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం,ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూడు సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.దాంతో రవితేజ కెరియర్ ఒక్కసారిగా నార్మల్ హీరో నుంచి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయింది.దాంతో వరుసగా సినిమాలు చేస్తూ రవితేజ ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాడు.ఇక రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే భావన ప్రొడ్యూసర్లకి వచ్చింది. దాంతో ఆయనతో ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చేవారు ఒకవేళ ఈయన సినిమా ఫ్లాప్ అయినా కూడా పెట్టిన డబ్బులు వస్తాయి అనే ఒక భరోసా అయితే వాళ్లలో ఉండేది.అందుకే రవితేజ డేట్స్ కోసం చాలామంది ప్రొడ్యూసర్స్ ఎదురుచూసేవారు. అలా రవితేజని ఇండస్ట్రీలో టాప్ హీరో చేసింది మాత్రం పూరి జగన్నాధ్ అనే చెప్పాలి. అయితే ఒక ఇంటర్వ్యూలో రవితేజని మీ సినీ కెరియర్ లో మీకు ఒక మంచి ప్లాట్ఫార్మ్ ఇచ్చి మంచి విజయాలను అందించిన డైరెక్టర్లలో మీకు కృష్ణవంశీ గారు అంటే ఇష్టమా లేదా పూరి జగన్నాథ్ అంటే ఇష్టమా అనే ఒక క్వశ్చన్ ని అడిగితే దానికి సమాధానంగా కృష్ణవంశీ అనే ఆయన నా కెరియర్ కి బేస్మెంట్ సరిగ్గా వేస్తే, దానిమీద పూరి జగన్నాథ్ అని ఆయన ఒక మంచి ఇల్లు కట్టాడు కాబట్టి నాకు ఇద్దరు ఇష్టమే అని చెప్పాడు…