Ram Charan- Shankar: #RRR వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో పాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే..ఇప్పటికే సగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ సంక్రాంతి కానుకగా ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా లాంచ్ చెయ్యబోతున్నారు..డైరెక్టర్ శంకర్ చాలా కాలం తర్వాత గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలను పక్కన పెట్టి ఒక పొలిటికల్ సబ్జెక్టు తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు..ఇప్పటికే ఆ రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యాయి..ఇప్పుడు లేటెస్ట్ గా రాజమండ్రి సముద్రపు ఒడ్డున వేసిన ఒక భారీ పొలిటికల్ మీటింగ్ సెట్ లో ఒక షెడ్యూల్ జరగనుంది..ఇందులో రామ్ చరణ్ తో పాటుగా శ్రీకాంత్ కూడా పాల్గొనబోతున్నాడు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తుంది..అదేమిటంటే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ పాత్రకి నత్తి ఉంటుందట..రామ్ చరణ్ ఈ పాత్ర ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్నాడట..ఇది వరకే ఆయన రంగస్థలం లో చెవిటోడి పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేసాడు..ఆ సినిమాకి రామ్ చరణ్ నటనే ప్రధాన బలం.

ఇప్పుడు మరోసారి అలాంటి ఛాలెంజ్ తో కూడిన పాత్ర రావడం తో కచ్చితంగా రంగస్థలం రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..కానీ ఈమధ్య కాలం లో వచ్చిన ‘లైగర్’ చిత్రంలో విజయ్ దేవరకొండ కూడా ఇలాగే నత్తి పాత్ర పోషించాడు..ఆ పాత్ర బాగా ట్రోల్ అయ్యింది..నత్తి పాత్రని సరిగా డీల్ చెయ్యకపోతే మొదటికే మోసం వస్తుంది..శంకర్ ఆ పాత్రని ఎలా మ్యానేజ్ చేసాడో అంటూ అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు.