Billa Special Shows: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ అభిమానులు ఆయనకీ సంబంధించిన పాత సినిమాలను 4K కి మార్చి స్పెషల్ షోస్ గా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ప్లాన్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అక్టోబర్ 14 వ తేదీన బిల్లా సినిమా స్పెషల్ షోస్ వేశారు..ఈ స్పెషల్ షోస్ కి అసలు రెస్పాన్స్ రాలేదు..ఇక అక్టోబర్ 23 వ తారీఖున ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిలిచిన ‘బిల్లా’,’వర్షం’ సినిమాలను ప్లాన్ చేసారు..అయితే వర్షం సినిమాకి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల అక్టోబర్ 23 వ తారీఖున కాకుండా 28 వ తారీఖున గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

అయితే బిల్లా సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్, హైదరాబాద్ మరియు వైజాగ్ వంటి ప్రాంతాలలో ప్రారంభం అయిపోయాయి..మన రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనే ట్రెండ్ ని కొనసాగిస్తున్నప్పటికీ,ఓవర్సీస్ లో మాత్రం చాలా డల్ గా ఉన్నాయి.
ఓవర్సీస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం అమెరికా లో ఒక్కటే ప్రారంభించారు..శనివారం రోజు రాత్రి ప్రీమియర్ షోస్ అంటే కలెక్షన్స్ మాములుగా ఉండవు..ఎందుకంటే అందరికి వీకెండ్ కాబట్టి..అలాంటి సమయం లో ఈ సినిమాకి స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేసుకున్నారు..కానీ బుకింగ్స్ మాత్రం చాలా వీక్ గా ఉన్నాయి..మొత్తం మీద అమెరికా లో ఈ సినిమాకి 62 స్పెషల్ షోస్ ఏర్పాటు చేసారు..వీటి నుండి కేవలం 8 వేల డాలర్లు వసూలు అవ్వగా, కేవలం 600 టికెట్స్ మాత్రమే అమ్ముడుపోయాయి..గతం లో ఇక్కడ స్పెషల్ షోస్ పడిన జల్సా, పోకిరి మరియు చెన్నకేశవ రెడ్డి సినిమాలకు అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

చెన్నకేశవ రెడ్డి కి 82 షోస్ నుండి 40 వేల డాలర్లు రాగా, జల్సా సినిమాకి 50 షోస్ కి గాని 37 వేల డాలర్లు వచ్చాయి..ఇక పోకిరి సినిమాకి 30 షోస్ కి గాను 16 వేల డాలర్లు వచ్చాయి..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తే బిల్లా సినిమా స్పెషల్ షోస్ పోకిరి ని దాటే అవకాశం ఉంది..కానీ శనివారం రోజు ఇలాంటి వసూళ్లు అంత మంచి ట్రెండ్ కాదనే చెప్పాలి..ఇక ఓవర్సీస్ లో మిగిలిన ప్రాంతాలైన ఆస్ట్రేలియా , లండన్ వంటి ప్రాంతాలలో బిల్లా కి స్పెషల్ షోస్ ప్రస్తుతానికి అయితే ఏర్పాటు చెయ్యలేదు.