Niharika Konidela: సెలెబ్రిటీలలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఈయన నటన , డ్యాన్స్ మరియు డైలాగ్స్ ని నచ్చని టాలీవుడ్ సెలబ్రిటీ అంటూ ఎవ్వరూ లేరు అని చెప్పొచ్చు. ఏ ఆర్టిస్టుని అయిన మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ పేరు క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తారు. అలాంటి టాలెంట్ ఉంది ఎన్టీఆర్ కి.
నిన్న మొన్నటి వరకు ఈయన కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన హీరో, ఇప్పుడు #RRR చిత్రం తో పాన్ వరల్డ్ మొత్తాన్ని తన వైపుకి చూసేలా చేసుకున్నాడు. అక్కడి సెలెబ్రిటీలు మరియు హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఎన్టీఆర్ నటనకి ఫిదా అయ్యిపోయారు. ఇక టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లిస్ట్ లో చేరిపోయిన మరో సెలబ్రిటీ మెగా బ్రదర్ నాగ బాబు ముద్దుల కూతురు నిహారిక కొణిదెల.
రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగా హీరోలు కాకుండా మీకు బాగా నచ్చిన టాలీవుడ్ హీరో ఎవరు అని అడగగా నిహారిక దానికి సమాధానం చెప్తూ ‘నాకు టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే ఎంతో ఇష్టం, అతని లాంటి ఆల్ రౌండర్ టాలీవుడ్ లో నేటి తరం హీరోలలో ఎవ్వరూ లేరు. ఆయన ప్రతీ సినిమాని నేను మిస్ కాకుండా చూస్తుంటాను’ అని చెప్పుకొచ్చింది నిహారిక కొణిదెల.
ఆమె మాట్లాడిన ఈ మాటలను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ఎప్పటి నుండో గొడవలు జరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నిహారిక కామెంట్స్ ఇప్పుడు ఈ ఇద్దరి హీరోల మధ్య గొడవ మరింత రెట్టింపు అయ్యేలా చేసింది.