Manoj vs Mohan Babu : చాలా కాలంగా మోహన్ బాబుతో మనోజ్ కి సఖ్యత లేదు. కొన్నేళ్లుగా మనోజ్ తండ్రితో కలిసి ఉండటం లేదు. భూమా మౌనికతో మనోజ్ రిలేషన్ మొదలయ్యాక దూరం మరింత పెరిగింది. చెన్నైలో రహస్యంగా ఏడాదిన్నర పాటు మౌనికతో ఉన్నానని మనోజ్ స్వయంగా ఓ షోలో వెల్లడించాడు. అసలు మౌనికను కోడలిగా మోహన్ బాబు అంగీకరించలేదని అంటారు. మనోజ్-మౌనికల పెళ్లి బాధ్యత అక్క మంచు లక్ష్మి తీసుకుంది. ఏదో మొక్కుబడిగా ఈ పెళ్ళికి మోహన్ బాబు, విష్ణు హాజరయ్యారు.
పెళ్లి అనంతరం విష్ణు తనపై దాడి చేయడానికి వచ్చాడని ఓ వీడియో ఫేస్ బుక్ స్టోరీలో షేర్ చేశాడు మనోజ్. ఆ వీడియోలో విష్ణు కోపంగా ఉన్నారు. అతన్ని ఒకరిద్దరు అదుపు చేస్తున్నారు. ఆ వీడియోను మనోజ్ వెంటనే డిలీట్ చేశాడు. ఆస్తుల వ్యవహారంలోనే మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయనే వాదన ఉంది. తాజాగా మోహన్ బాబు-మనోజ్ ఒకరిపై మరొకరు ఫహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారన్న న్యూస్ సంచలనంగా మారింది.
గాయాలతో ఉన్న మనోజ్.. భార్యతో పాటు స్టేషన్ కి వెళ్లి తండ్రి మోహన్ బాబు తన మనుషులతో దాడి చేయించాడని కేసు పెట్టాడట. మోహన్ బాబు తిరిగి మనోజ్ తనపై దాడి చేశాడని కేసు పెట్టాడట. ఈ మేరకు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మంచు ఫ్యామిలీకి తిరుపతిలో గల ఆస్తులు, విద్యాసంస్థల పై ఆధిపత్యం, పంపకాల విషయంలో విబేధాలు నెలకొన్నాయని అంటున్నారు.
కాగా మోహన్ బాబుకు పెద్ద కుమారుడైన విష్ణు అంటే ఎక్కువ ఇష్టం. మనోజ్ ని నిర్లక్ష్యం చేస్తున్నాడనే ఓ వాదన ఉంది. 2003లో విష్ణు అనే మూవీతో మంచు విష్ణు లాంచ్ అయ్యాడు. అప్పట్లోనే ఆ మూవీ బడ్జెట్ రూ. 30 కోట్లు అని సమాచారం. అంత గ్రాండ్ గా విష్ణును పరిచయం చేశాడు. కానీ మనోజ్ ని ఒక డబ్బింగ్ మూవీతో స్మాల్ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందు తెచ్చాడు.
ఎన్ని ఫ్లాప్స్ పడినా విష్ణుతో చిత్రాలు నిర్మించడం మోహన్ బాబు ఆపలేదు. ఇప్పుడు కూడా దాదాపు రూ. 70-80 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప చేస్తున్నాడు. మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా ఏళ్ళు అవుతుంది. మనోజ్ తో ఆయన సినిమాలు నిర్మించడం లేదు. ఇక మంచు ఫ్యామిలీకి అతిపెద్ద ఆదాయ వనరు, వందల కోట్ల విలువ చేసే ఆస్తి అయిన విద్యాసంస్థల బాధ్యత విష్ణుకు అప్పగించాడు. ఇవన్నీ గమనిస్తుంటే మనోజ్ నిర్లక్ష్యానికి గురయ్యాడనే పుకార్లు చెలరేగాయి. కాగా మోహన్ బాబుకు రెండు వివాహాలు. మొదటి భార్య విద్యాదేవి కన్నుమూశారు. ఆమె పిల్లలు లక్ష్మి, విష్ణు. రెండో భార్య నిర్మలాదేవి కొడుకు మనోజ్. విద్య, నిర్మల సొంత అక్కాచెల్లెల్లు అవుతారు