Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రేమ జంటల్లో ‘మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్’ జంట ఒకటి. పైగా ఈ టాలీవుడ్ మోస్ట్ లవింగ్ కపుల్స్ లో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కాగా పెళ్లి రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘అప్పుడే 17 సంవత్సరాలు అయిపోయింది. హ్యాపీ యానివర్సరీ. ఇలాంటివి మరిన్ని జరుపుకోవాలి. ఇదంతా ప్రేమతో’ అని తన భార్య నమ్రతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పాడు.

‘మా ఇద్దరి మధ్య చాలా ప్రేమ ఉంది. మా ప్రేమలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇది జీవితాంతం కొనసాగుతుంది’ అని నమ్రత పోస్టు చేసింది. మొత్తానికి ఇద్దరు ఒకరి పై ఒకరు ఎంత గాఢమైన ప్రేమ ఉందని ఈ మెసేజ్ లతో రుజువు చేసుకున్నారు. పైగా రీసెంట్ గా మహేష్ నమ్రత గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు నమ్రతను ఉద్దేశించి ఒక మెసేజ్ పోస్ట్ చేస్తూ.. ‘నువ్వు నా రాక్.. నాతో నా ప్రపంచాన్ని పంచుకుంటున్నందుకు కృతజ్ఞతలు” అని నమ్రత ఫొటోను ట్విట్‌లో పోస్ట్ చేశారు.
Also Read: Prabhas: ప్రభాస్ – జగన్ అసలు ఎలా పలకరించుకున్నారు ?
ఆ ట్వీట్ ఆ మధ్య బాగా వైరల్ అయ్యింది కూడా. ఈ ట్వీట్ కి పలువురు స్పందిస్తూ కామెంట్లు కూడా చేశారు. మహేష్ కి నమ్రత అంటే.. ఇంత ప్రేమ ఉందా అంటూ ఆశ్చర్యపోయారు కూడా. నమ్రత కూడా తమ పెళ్లి రోజు సందర్భంగా తన భర్త పై ఉన్న తన ప్రేమను తెలుపుతూ.. తనదైన శైలిలో విషెస్ తెలిపింది. అలాగే సెలబ్రెటీలు, ఫ్యాన్స్ కూడా తమ సూపర్ స్టార్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

అన్నట్టు మహేష్ ఈ రోజు జగన్ భేటీ అయిన సినీ పెద్దలలో ఒకరు. నిజానికి ఈ రోజు మహేష్ ఫ్యామిలీ ఫారెన్ ట్రిప్ ప్లాన్ చేసింది. కానీ.. చిరంజీవి ఫోన్ చేసి మరీ మహేష్ ను భేటీకి రావాల్సిన అవసరం ఉంది అడగడంతో మహేష్ జగన్ తో మీటింగ్ కోసం తన ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకున్నాడు.
Also Read: జగన్ తో స్టార్లు భేటీ.. కానీ, ఎన్టీఆర్ కలవట్లేదు !
[…] Vishnu Manchu: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో చిరంజీవి, మహేశ్ బాబు, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డితో భేటీ అయి.. సినిమా టికెట్ల ధరల పెంపు పై చర్చించారు. జగన్ కూడా దీనికి ఓకే చెప్పారు. అలాగే.. ఎంపిక చేసిన సినిమాలకు సబ్సిడీ కూడా ఇచ్చేలా జగన్ ను ఒప్పించారు. ఎలాగూ జీఎస్టీ మినహాయింపు కూడా ఉండనుంది. అదేవిధంగా వివాదాస్పదంగా మారిన ఆన్‌లైన్ టికెట్ అమలను ఫిల్మ్ ఛాంబర్‌కు అప్పగించడం పై కూడా చర్చించారు. దీనికి కూడా జగన్ అంగీకరించినట్లు తెలుస్తోంది. […]