Neha Chowdary Marriage: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న నేహ చౌదరి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లుగా తన వరుడెవడరనే విషయంపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర దించింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పటికే పేర్కొన్న ఈ భామ ఇప్పుడు తనకు కాబోయే భర్త పేరు, ఫొటో పెట్టి షాక్ ఇచ్చింది. యాంకర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నేహ ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి అడుగుపెట్టింది. అక్కడ తన ఫర్పామెన్స్ తో పలువురిని ఆకర్షించింది. స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయిలో రాణించింది. నటనపై ఉన్న ఆసక్తితో ఇప్పుడు వినోద రంగంలో రాణిస్తోంది.

నేహ చౌదరి కి సోషల్ మీడియాలో విపరీత ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో ఆమె అభిమానులు పర్సనల్ విషయాల పై ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉంటారు. ఈ క్రమంలో నేహ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారో చెబుతారా..? అని కొందరు ప్రశ్నించారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టేముందే పెళ్లి గురించి ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. హౌస్ నుంచి ఎప్పుడు బయటకు వస్తానో.. అప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కానీ ఆ సమయంలో వరుడు ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
తాజాగా ఈ భామ తనకు కాబోయే వరుడి పేరు చెప్పి ఆకర్షించింది. తాను ఇంజనీరింగ్ చేసే సమయంలో క్లాస్ మేట్ అయిన అనిల్ ను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. ఆ సందర్భంగా ఆయన ఫొటో ను కూడా ఆడియన్స్ కు ఇంట్రడ్యూస్ చేసింది. తిరుపతిలో జన్మించిన నేహ చౌదరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన విషయం తెలిసిందే. స్టడీస్ పూర్తయిన తరువాత ఆమె ఆరు నెలల పాటు సాఫ్ట్ వేర్ జాబ్ కూడా చేసింది. ఈ సమయంలోనే తనకు అనిల్ తో పరిచయం ఏర్పడిందని తెలిపింది.

ఓ వైపు స్టడీస్ చేస్తూనే జిమ్నాస్టిక్ లో రాణించింది నేహ. అయితే ఎంటర్టైన్మెంట్ రంగంపై ఉన్న ఆసక్తితో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టింది. మొదట్లో కొన్ని ప్రముఖ ఛానెల్స్ లో పనిచేసిన ఆమెకు పాపులారిటీ తెచ్చుకుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లోకి అడుగు పెట్టే అవకాశం వచ్చింది. హౌస్ లో మిగతా కంటెస్టెంట్ల కంటే నేహ చౌదరి విభిన్నంగా తన పర్ఫామెన్స్ కొనసాగిస్తోంది.