Swarnakamalam: ప్రమఖ డైరెక్టర్ కె.విశ్వనాథ్ మన మధ్య లేకపోయినా ఆయన తీసిన చిత్రాలు ఇప్పటికీ అలరిస్తున్నాయి. సాంప్రదాయాన్ని ఉట్టిపడేస్తూ.. సమాజంలో జరిగే విషయాలను కొన్ని పద్ధతుల ద్వారా వివరించారు విశ్వనాథ్ గారు. అందుకే ఆయన చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లాయి. విశ్వనాథ్ మదిలో నుంచి వచ్చిన సాంప్రదాయ చిత్రం ‘స్వర్ణ కమలం’. నాట్యం గురించి తెలుపుతూ చిత్రీకరించిన ఈ మూవీ 1988లో థియేటర్లోకి వచ్చింది. వెంకటేష్, భానుప్రియలు కలిసి జంటగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో బంపర్ హిట్టు కొట్టింది. ఇప్పటికీ ఈ సినిమా ఈటీవీలో వస్తూ అలరిస్తుంది. అయితే ఈ సినిమా గురించి ఓ విషయం ఇప్పడు చర్చల్లోకి వచ్చింది. ఇందులో ఓ సీన్ పై ఆసక్తికరంగా చర్చ సాగుతోంది. అసలు విషయమేంటంటే?
సోషల్ మీడియా వచ్చాక సినిమాకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. చాలా మంది వీటికి సంబంధించిన చర్చలు పెడుతున్నారు. తాజాగా ‘స్వర్ణకమలం’ సినిమాలో ఓ సీన్ కు సంబంధించి చర్చించుకుంటున్నారు. ఇందులో ఒక సీన్ ను రెండు సార్లు తీశారు. దానిని డిఫరెంట్ గా తీశారు. అలా ఎందుకు తీశారని అప్పుడు గమనించలేదు. కానీ ఇప్పుడు ఆ సీన్ ఎందుకు పెట్టారో అర్థమైందని అంటున్నారు.
‘స్వర్ణ కమలం’ సినిమాలో భానుప్రియ మీనాక్షి పాత్రలో నటిస్తుంది. నాట్యకళ అందరికీ రాదని, అది జన్మజన్మల పుణ్యమని వేదపండితుడు భావిస్తాడు. దీంతో తన కూతురు మీనాక్షికి నాట్యం నేర్పిస్తాడు. కానీనాట్యం కడుపు నింపదని, కాలం మారుతున్న కొద్దీ మనమూ మారాలని మీనాక్షి భావిస్తుంది. ఈ క్రమంలో తండ్రి ఒత్తిడితో ఉన్న ఆమె మనసు గందర గోళంగా ఉంటుంది. ఆ తరవాత చంద్రశేఖర్ తో పరిచయం అయిన తరువాత మీనాక్షి మనసు మారుతుంది. దీంతో ఆమె నిశ్చల స్థితికి వస్తుంది.
ఈ క్రమంలో డైరెక్టర్ విశ్వనాథ్ మీనాక్షి మనసు మారకుముందు అద్దం ముందు మేకప్ వేసుకునేటప్పుడు గందరగోళంగా ఉంటుంది. మనసు మారిన తరువాత పద్ధతిగా మేకప్ వేసుకుంటుంది. ఈ సన్నివేశాన్ని అప్పుట్లో ఎవరూ గుర్తించలేదు. కానీ పరుచూరి గోపాల కృష్ణ తో జరిగిన ఓ చర్చలో కొందరు ఈ సన్నివేశం గురించి చర్చించారు. ఆ సీన్ కు సంబంధించిన రెండు సీన్లను పెట్టిన ఒక అమ్మాయి మనసు మారకు ముందు.. మారిన తురువాత..ఎలా ఉంటుందో కె.విశ్వనాథ్ గారు అద్భుతంగా చూపించారని అనుకుంటున్నారు.
View this post on Instagram