Priyamani : సౌత్ ఇండియా లో అద్భుతమైన నటన కనబర్చే హీరోయిన్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. ఆ తక్కువమందిలో ఒకరు ప్రియమణి(Priyamani). ఈమె తెలుగు లో ‘ఎవరే అతగాడు’ అనే చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ తమిళం లో అనేక అవకాశాలు వచ్చాయి. అక్కడ పలు హిట్స్ ని అందుకొని మళ్ళీ తెలుగులోకి జగపతి బాబు హీరోగా నటించిన ‘పెళ్ళైన కొత్తలో’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడంతో మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక తమిళం లో ఆమె నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది. అలా సౌత్ లో చక్రం తిప్పిన ఈమె బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది.
అప్పట్లో షారుఖ్ ఖాన్(Sharukh Khan) హీరో గా నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ చేసిన ఈమె, ఆ తర్వాత ‘జవాన్'(Jawan Movie) చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించింది. షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన జవాన్ చిత్రం 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలా 2022 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె, ఈమధ్య కాలం లో సినిమాలను బాగా తగ్గించింది. ప్రస్తుతం ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3 ‘ వెబ్ సిరీస్ మాత్రమే చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానుంది. ఈ వెబ్ సిరీస్ తర్వాత ఆమె ఏ సినిమాకి కూడా అగ్రిమెంట్ చేసుకోలేదు. ఒకప్పుడు ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ డ్యాన్స్ షోలో జడ్జీగా వ్యవహరించేది కానీ, ఇప్పుడు అది కూడా లేదు.
ఇదంతా పక్కన పెడితే ఈమెకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారింది. ఈమె కజిన్ సిస్టర్ మరెవరో కాదు, బాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోలతో సరిసమానమైన ఇమేజి ని సొంతం చేసుకున్న విద్య బాలన్(vidhya balan). ఈమె ప్రియమణి కి స్వయంగా కజిన్ సిస్టర్ అవుతుందని గతంలో ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విద్య బాలన్, ‘డర్టీ పిక్చర్’ చిత్రంతో దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అలా ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి సూపర్ హిట్స్ ని అందుకుంది. ఇప్పటికీ ఆమె రెగ్యులర్ గా సినిమాలు చేస్తుండడం గమనార్హం. గత ఏడాది ఈమె ‘భూల్ బులియా 3’ తో భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.